బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్
లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపిం చారు.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా
ఆయనతో పాటు మరికొందరు సీనియర్ లు కూడా
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపిం చారు. రాపోలు ఆనంద భాస్కర్‌తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపా ధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్లు బి ఆర్ఎస్ కు రాజీనామా సమర్పిం చారు. ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నానన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో తన లాంటి నేతలు ఉన్నారన్నారు.
2022లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరానన్నారు. ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక తన అనుబంధాన్ని తుంచుకుంటున్నానని రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. తాను బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైద రాబాద్ తెలంగాణ భవన్‌కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపినట్టు తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పోరాడేలా తన భవిష్యత్తు కార్య చరణ ఉంటుందన్నారు. హైదరా బాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తానన్నారు. కుల జన గణన అంశం ఉద్యమాల్లో తన పాత్ర ఉంటుందన్నారు. కేసీఆర్ గణాంకాల కోసం సకల జనుల సర్వే మాత్రమే చేశారని రాపోలు అన్నారు.
Former BRS MP Rapolu Ananda Bhaskar resigned