POLLING: ఎన్నికల నేపథ్యంలో పటిష్ట నిఘా
పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం మద్యం, డబ్బు ఇతర వస్తువుల అక్రమ రవాణా పై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలో భాలకు గురిచేయకుండా ఉండేం దుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపా రు.
ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, ఇతరాలపై ఉక్కుపాదం
ఎన్నికలు కోడ్ నాటి నుంచి రూ. 14 కోట్ల 42 లక్షల నగదు, వస్తు వులు సీజ్
జిల్లా వ్యాప్తంగా వివిధ కేసులలో ఉన్న 943 మంది బైండోవర్, 116 ఆయుధాలు డిపాజిట్
ఎన్నికలు పారదర్శకంగా నిర్వ హించేందుకు చర్యలు
నల్లగొండ జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన, నల్లగొండ: పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం మద్యం, డబ్బు ఇతర వస్తువుల అక్రమ రవాణా పై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలో భాలకు గురిచేయకుండా ఉండేం దుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పి చందనా దీప్తి(SP Chandana Deepti)తెలిపా రు. జిల్లా వ్యాప్తంగా మూడు అంత ర్రాష్ట్ర, ఐదు అంతర్ జిల్లా చెక్ పోస్టులను, ఏర్పాటు చేసి క్షుణ్నం గా తనిఖీలు చేస్తోందని పేర్కొన్నారు.
ఆదివారం ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎన్నికల కోడ్(Election Code)అమలులోకి వచ్చిన నాటి నుండి ఈరోజు వరకు దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ. 3 కోట్ల 89 లక్షల 67 వేల నగదు, 27 లక్షల 43 వేల విలువ గల మద్యం, 6 లక్షల 53 వేల విలువగల గంజాయి, 5 కోట్ల 73 లక్షల విలువ గల ఆభర ణాలు, 3 కోట్ల 73 లక్షల విలువ గల ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. అంతే కాకుండా సర్వేలెన్స్ టీమ్స్,స్టాల్టికల్ టీమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరవేక్షిస్తు న్నామని అన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు ..
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు(Vote) హక్కును వినియోగించు కునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహిం చేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఇప్పటికీ వివిధ కేసులలో ఉన్న పాత నేరస్తులను రౌడీ షీటర్స్ ను 512 కేసులలో 943 మందిని బైండోవర్ చేయడం జరిగింది.
వీరందరికి మళ్ళీ తిరిగి నేరాలకు పాల్గొన్నకుండా జిల్లా పోలీసు(Police) కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందని, వీరిపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు.అలాగే జిల్లా వ్యాప్తంగా లైసెన్స్(License)కలిగిన వ్యక్తుల నుంచి 116 ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందనీ తెలిపారు.ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు.
Full security in polling centers