Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda: భారీ మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

లోకసభ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నల్గొండ లోకసభ అభ్యర్థి కుందూరు రాఘువీర్ రెడ్డి గెలుపు ఆకాంక్షిస్తూ మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ సేవాదళ్ సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రజా దీవెన, మిర్యాలగూడ:  లోకసభ సార్వత్రిక ఎన్నికలలో(Lok sabha elections) భాగంగా నల్గొండ లోకసభ అభ్యర్థి కుందూరు రాఘువీర్ రెడ్డి గెలుపు ఆకాంక్షిస్తూ మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ సేవాదళ్ సమావేశం నిర్వహించడం జరిగింది.రాష్ట్ర సెక్రటరీ నల్లగొండ(Nalgonda) పార్లమెంట్ ఇంచార్జి పిట్టల బాల రాజు మాట్లాడుతూ జరగబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోగల రెండు లోక్ సభ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.

స్వా తంత్రం వచ్చిన నాటి నుండి కూడా కుల,మతాలకు అతీతంగా అన గారిన ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గత పది సంవత్సరాలుగా తెలం గాణ రాష్ట్రంలో, భారతదే శంలో ఒక అరాచక పాలన సాగి నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగా ణ ప్రాంతం,నీళ్లు, నిధులు, నియ మకాలు అనే సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్(TRS) పార్టీ తన స్వార్థ రాజకీయాలకు తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన నీళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పజెప్పి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక కుటుంబానికి నిధులను సమకూర్చుకొని, యువకులను నిరుద్యోగులను చేసి సోమరిపోతులుగా తాగుబోతు లుగా చేసి ఒక్క కుటుంబాన్ని మాత్రం రాజకీయ ఉద్యోగులుగా మలుచుకోవడం జరిగినదని ఆరోపించారు.

దేశంలో మతం పేరు చెప్పి అధికారం లోకి వొచ్చిన బిజెపి(BJP) పార్టీ ఆర్ధిక నేరగాలకు అండగా ఉంటూ ఒక్కరిదరిని ప్రపంచ కుబేరులుగా చేసి దేశం లో వున్న యువతను, రైతులను, అణగారిన పేదలను గాలికి వొదిలేసి వివిధ రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం గా ఏర్పడిన ప్రభుత్వలను ఆర్ధిక నేరగాల సహాయం తో లేదా కొన్ని స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ల సహాయం తో ఆప్రజాస్వామ్యం గా ప్రభుత్వా లను కూల్చి బిజెపి పార్టీ సొమ్ము చేసుకుంటున్నది. ఈ నిరంకుశ పాల నకు అనుగుణంగా 2023 శాసనసభ సర్వత్రిక ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ కి బుద్ధి చెప్పినట్టుగా దేశం లో బిజెపి పార్టీ కి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్న మైందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ(Telangana) రాష్ట్రం లో బి ఆర్ ఎస్ పార్టీ కి ఒక్కలోక్ సభ స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని, రాష్ట్ర మంత్రి వర్యు లు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మిర్యాలగూడెం నాగా ర్జున సాగర్ దేవరకొండ కోదాడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, బాలునా యక్,ఉత్తమ్ పద్మావతి రెడ్డి అదేవిదంగా మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి మరియు డీసీసీ అధ్యక్షుల సహాయ సహకారాలతో
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభి మానులు కృషి చేసి రాష్ట్రం లోని 17 లోక్ సభ స్థానలో కెల్లా నల్లగొండ లోక్ సభ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy) భారీ మెజార్టీ తో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది.

పత్రిక సమావేశం అనంతరం డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ నల్గొండ జిల్లా అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి గారు, పార్లమెంట్ కో -ఇంచార్జి కేతిరెడ్డి శకుంతల రెడ్డి గారు, మిర్యాలగూడ మహిళా ఇంచార్జి ఉబ్బపెల్లి ప్రమీల, యాదాద్రి జిల్లా జెనరల్ సెక్రటరీ కొప్పుల బాలరాజు, మండల ప్రసిడెంట్ ఆకుల పరమేశ్వ్వారీ, మిర్యాలగూడ టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి ,డీసీసీ జెనరల్ సెక్రటరీ బాలు, మిర్యాలగూడ సేవాదళ్ యంగ్ బ్రీగెడ్ ప్రసిడెంట్ మహ్మద్ ఇమ్రాన్, మిర్యాలగూడ టౌన్ యంగ్ బ్రీగేడ్ ప్రసిడెంట్ అశోక్ నాయక్,జెనరల్ సెక్రటరీ వెంకటేష్, సాగర్ యంగ్ బ్రీగెడ్ ప్రసిడెంట్ శ్రీనివాస్ గార్లు పాల్గొనడం జరిగింది.

Congress win in nalgonda parliament