Andhra DGP: ఏపీ డీజీపీ గా హరీశ్ గుప్తా
ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సీనియార్టీ జాబితాలోని ఐ పీ ఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీశ్ గుప్తాను నియమిం చాలని ఎన్నికల సంఘం ఆదేశించిం ది.
ఉత్తర్వులు విలువరించిన ఎన్నికల కమిషన్
ఈ సాయంత్రం లోపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశం
ప్రజా దీవెన, అమరావతి: ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను(Harish Gupta ) ఈసీ నియమించింది. సీనియార్టీ జాబితాలోని ఐ పీ ఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా(Harish Gupta ) పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీశ్ గుప్తాను నియమిం చాలని ఎన్నికల సంఘం ఆదేశించిం ది. తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి నుంచి ఆయన బాధ్య తలు స్వీకరించారు. డీజీ నియా మకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆయన ఈ పద విలో కొనసాగుతారు.
కాగా డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సం ఘం ఆదివారం వేటు వేస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ పోస్టు కోసం సోమవారం ఉదయం 11 గంటలలోపు ముగ్గురు డీజీ(DG Rank) ర్యాంక్ స్థాయి అధికారుల జాబితా ను పంపించాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ ల వివరాలను ప్యానెల్ తో పాటు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి నిర్దేశించింది. సీఎస్ పంపిన జాబితాలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుండగా ఆ మేరకు హరీష్ గుప్తాను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతిపక్షాల ఆరోపణ లతో ..ఏపీ డీజీపీగా(AP DGP) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనా థరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచా రనే విమర్శలు ఉన్నాయి. అంతా గమనించేలా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆయా పార్టీల నేతల ఆరోపించారు. ఎన్ని కల కోడ్ వచ్చాక కూడా ఆయన అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అణగదొక్కడంపై విమర్శలున్నా యి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే ఆయన ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారనే ప్రచారం సాగిం ది. ఆయన డీజీపీగా ఉంటే ఎన్నిక లు పారదర్శకంగా జరగవని ప్రతిప క్షాలు ఆరోపించాయి. ఈ ఫిర్యాదు లతో విచారణ చేసిన ఈసీ డీజీపీపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకూ ఆయన కు ఎన్నికలకు సంబంధించి ఎలాం టి విధులూ అప్పగించొద్దని ఆదేశిం చింది.
Harish Gupta as Andhra pradesh DGP