Counting: ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనిశెట్టి దుప్పలపల్లి లోని గోదాంలో ఏర్పాట్ల కై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన గోదామును పరిశీలించారు.
ప్రజా దీవెన నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనిశెట్టి దుప్పలపల్లి లోని గోదాంలో ఏర్పాట్ల కై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన(Dasari Harichandana) గోదామును పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కు 4 హాల్స్ తయారుచేయాలని, ప్రతిహాలులో 25 టేబుల్స్ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో ఎమ్మెల్సీ (MLC)ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.
ఓట్ల(Votes)లెక్కింపు కేంద్రంలో స్ట్రాంగ్ రూము ఏర్పాటు, అదేవిధంగా రూఫ్ సరిగా వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని, ఓట్ల లెక్కింపుకు, బ్యాలెట్ బాక్స్(Ballot box) భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్ తదితరులు ఉన్నారు.
Collector inspected counting centre