Andhra Pradesh: జన్మభూమి రుణం తీర్చుకుoదాం
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి.. భూమి భారతిని అని చాటిచెప్పిన రాయప్రోలు, గురజాడ మాటల్ని జ్ఞప్తికి తెచ్చు కుని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుం దామని తెలంగాణ తెదేపా ఉపాధ్య క్షురాలు, మాజీ మంత్రి, తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన ఆంధ్ర ప్రజలకు పిలుపు నిచ్చారు.
మంచి తరుణం ఆసన్నమైనందు న తరలిరండి
తెలంగాణ తెదేపా ఉపాధ్యక్షు రాలు, తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన
ప్రజా దీవెన, విజయవాడ: ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి.. భూమి భారతిని అని చాటిచెప్పిన రాయప్రోలు, గురజాడ మాటల్ని జ్ఞప్తికి తెచ్చు కుని ఆంధ్ర రాష్ట్రాన్ని(Andhra pradesh ) కాపాడుకుం దామని తెలంగాణ తెదేపా ఉపాధ్య క్షురాలు, మాజీ మంత్రి, తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన ఆంధ్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. విజయవాడ మహాత్మా గాంథీ రోడ్డులోని ఓ హోటల్‌లోఆమె మంగళవారం మీడియా ప్రతి నిధు లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంటే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా మారడం శోచనీయ మన్నారు.
తలసరి అప్పులు నానా టికీ పెరిగిపోతూ ప్రతి మనిషి తల మీద సుమారుగా రూ.2లక్షలు అప్పు దగ్గరవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గుం టూరు జిల్లాలోని పొన్నూరు నియో జకవర్గం తన పుట్టినిల్లని తెలిపారు. ఆ హక్కుతోనే ప్రజలను చైతన్యవం తులు చేయాలనే ఉద్దేశంతోనే తా మంతా రాష్ట్ర ప్రగతి కోసం, మార్పు కోసం చంద్రబాబు(chandrababu naidu) నాయకత్వాన్ని బలపరుస్తూ తిరుగుతున్నామన్నా రు.
ప్రాజెక్టులు, రవాణా, వైద్య, ఉ ద్యోగ సౌకర్యాలు లేక కనీసం మా ట్లాడే స్వేచ్ఛను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు ధైర్యం, మగువ మాంచాల, బాలచంద్రుడు, బ్రహ్మ నాయుడుల ధైర్యసాహసాలు పుణి కిపుచ్చుకున్న ఈ గడ్డ పౌరుషాలకు పుట్టిల్లన్నారు. అన్న నందమూరి తారక రామారావు నినదించిన ఆత్మ గౌరం నేడు మళ్ళీ మనకు అవసరమైందన్నారు. జగన్(YS Jagan) కాళ్ల కింద తాకట్టు పెట్టబడ్డ ఆత్మగౌర వాన్ని ఆత్మాభిమానంతో సాధించు కుందామని కాట్రగడ్డ ప్రసూన పిలు పునిచ్చారు.
Save Andhra pradesh from ys jagan