Congress campaign: బి ఆర్ ఎస్, భాజాపా ప్రజలకు చేసింది ఏమీ లేదు:చందర్ రావు
గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, బి ఆర్ ఎస్ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు.
ప్రజా దీవెన కోదాడ: గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, బి ఆర్ ఎస్ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. గురువారం నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయాన్ని కోరుకుంటూ పట్టణంలోని 3, 18 వార్డుల్లో కౌన్సిలర్లు సామినేని.నరేష్, కర్రీ. శివ,సుబ్బారావు మిత్రపక్షాల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురిగి పోతుందని అన్నారు.
బిజెపి పార్టీ కులాల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సామినేని. ప్రమీల, ముత్తవరపు. పాండురంగారావు,ఎర్నేని. బాబు,పట్టణ అధ్యక్షులు వంగవీటి. రామారావు, కౌన్సిలర్లు సామినేని. నరేష్, కర్రి.శివ, సుబ్బారావు,సిపిఐ నాయకులు బొల్లు.ప్రసాద్, నెమ్మది.దేవమణి, అనురాధ, జగన్నాథ రెడ్డి,కంబాల. రంగా, కంబాల.ప్రసాద్,కల్పన,శ్రీనివాస్, కత్తి.సుధా రెడ్డి,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BRS and BJP not development in Telangana