మైనార్టీలను గుర్తించింది బిఆర్ఎస్ పార్టీనే షేక్. నయీమ్
పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల. కృష్ణారెడ్డికి ముస్లిం మైనార్టీలంతా అండగా నిలవాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి షేక్. నయీమ్ ఓటర్లను కోరారు.
ప్రజా దీవెన కోదాడ. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) నల్గొండ బి ఆర్ ఎస్(BRS Party) పార్టీ అభ్యర్థి కంచర్ల. కృష్ణారెడ్డికి ముస్లిం మైనార్టీలంతా అండగా నిలవాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి షేక్. నయీమ్ ఓటర్లను కోరారు. గురువారం పట్టణంలోని 33 వ వార్డులో కంచర్ల. కృష్ణారెడ్డి విజయాన్ని కోరుకుంటూ
గడప,గడపకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నహీం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం మత సామరస్యంతో విరాజిల్లిందని ముస్లింలకు(Muslims) కేబినెట్లో హోం శాఖ మంత్రి ఇచ్చి మైనార్టీలకు(minorities) పెద్దపీట వేసిందన్నారు. మైనారిటీలను గుర్తించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ నే అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు నాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్బు,యూసుఫ్, అల్తాఫ్, ఆరిఫ్, జానయ్య, కాజా మొయినుద్దీన్, నసీర్ తదితరులు పాల్గొన్నారు.
BRS party support minorities