Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

village development: గ్రామాలలో అభివృద్ధి బాధ్యత మాదే

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మెజార్టీ వచ్చిన గ్రామాలలో అభివృద్ధి బాధ్యత మాదేనని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు అన్నారు.

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,మాజీ జడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి

ప్రచారం సందర్భంగా కంచనపల్లిలో భారీ ర్యాలీ

ప్రజా దీవెన నల్గొండ టౌన్:  పార్లమెంట్ ఎన్నికలలో(Parliament elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మెజార్టీ వచ్చిన గ్రామాలలో అభివృద్ధి బాధ్యత మాదేనని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు అన్నారు.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో(congress) కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకువచ్చి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గౌరవాన్ని మరింత పెంచాలని అన్నారు.

భారీ మెజార్టీ వచ్చిన గ్రామాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మెజార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమకు తామే పోటీ పడాలని కోరారు. ఎన్నికల అనంతరం అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు మెజార్టీ వచ్చిన గ్రామాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పార్టీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మెజార్టీ మరింత పెరగాలన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు(Parliament elections) ముగిసిన తర్వాత అన్ని గ్రామాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామాలలో ఇండ్లు లేని వారికి ఇండ్లు, పెన్షన్లు, ఇతర అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన లక్ష మెజార్టీ హామీని మనమంతా నిలబెట్టుకోవాలన్నారు.పార్టీలో పాత, కొత్త అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా ప్రచారం నిర్వహించి ఓట్లు రాబట్టాలన్నారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా హస్తం కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పు నవీన్ గౌడ్, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు దండు ఎల్లయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మర్రి మల్లయ్య, మాజీ వార్డ్ సభ్యులు మర్రి సోములు,మర్రి యాదయ్య,కొప్పోలు నరసింహ,కొప్పోలు అశ్విని, గ్రామ శాఖ అధ్యక్షులు సల్వోజు బ్రహ్మయ్య చారి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ధనమ్మ, యువజన కాంగ్రెస్,ఎన్ఎస్ యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జీ.కే.అన్నారం గ్రామంలో….

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జీకే అన్నారం,దీపకుంట గ్రామాలలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈశ్వర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

village development responsible