పేదల వ్యతిరేక పార్టీ బిజెపి
--మనుషుల మధ్య అంతరాలకు కారణం బిజేపి పార్టీ --దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే --తెలంగాణ లో వచ్చిన పెను మార్పు కు కారణం కేసీఆర్ --దేశంలో అభివృద్ధి కి ఆటంకంకు కారణం మోడీ -- 6ఏళ్ల లోనే 60ఏళ్ల అభివృద్ధి చూపించిన నేత కేసీఅర్
పేదల వ్యతిరేక పార్టీ బిజెపి
–మనుషుల మధ్య అంతరాలకు కారణం బిజేపి పార్టీ
–దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే
–తెలంగాణ లో వచ్చిన పెను మార్పు కు కారణం కేసీఆర్
–దేశంలో అభివృద్ధి కి ఆటంకంకు కారణం మోడీ
— 6ఏళ్ల లోనే 60ఏళ్ల అభివృద్ధి చూపించిన నేత కేసీఅర్
ప్రజా దీవెన/సూర్యాపేట:2014 తరువాత తెలంగాణ లో వచ్చిన మార్పు కు కారణం కేసీఆర్ అయితే.. దేశంలో అభివృద్ధి కి ఆటంకం ప్రధాని మోడీ అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో జరుగుతున్న అభివృద్ధికి తోడు గా నియోజకవర్గం లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట మున్సిపాలిటీ రాజీవ్ నగర్ లో బిజెపి నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్బంగా ఏర్పాటు చేసిన చేరికల సభ లోభాజాపా దళిత మోర్చ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు,వల్డాస్ ఉపేందర్,
బి జె పి 20 వ వార్డు అద్యక్షుడు సోమగాని లక్ష్మణ్,బిజెపి 35 వ వార్డుఅద్యక్షుడు బల్గూరి రాజు,బిజె పి 17 వ వార్డు అధ్యక్షుడు మెరుగు మదన్ తో పాటు 500మంది బిజెపి కార్యకర్తలు, భాజాపా ను వీడి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బిజెపి నాయకులకు గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదర స్వగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూపేదల వ్యతిరేఖ పార్టీ బిజెపి అని విమర్శించారు. సమాజం లో దళితులు అనే పదం పుట్టడానికి కారణం బిజెపి నే అన్నారు.మనుషుల మధ్య అంతరాలకు కారణం బిజెపి నే అని పేర్కొన్నారు.దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అన్నారు. తమ పాలన ఉన్న రాష్ట్రాల లో పెన్షన్ ఇవ్వడంట్ చేతకాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇస్తమనడం ప్రజలను మభ్యపెట్టడమే అన్నారు.
2014 కు ముందు తెలంగాణ లో ఉన్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా ఉన్నాయన్నారు.6ఏళ్ల లోనే 60ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడిన మంత్రి, మారో 60 ఏళ్లు కేసీఆర్ విప్రభుత్వమే ఉండటం ఖాయం అన్నారు.. ప్రజలు 65ఏళ్ల పాటు కాంగ్రెస్ , బిజెపి లకు అధికారం కట్టపెడితే 6పైసల అభివృద్ధి కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.
అబద్దపు మాటలతో మోసం చేయడానికి వస్తున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి,ఎవరు నిజం…ఎవడు అబద్దం అనేది ప్రజలు గ్రహించాలి అని కోరారు.దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరుతున్నాయన్నారు.
ప్రపంచం లో నంబర్ వన్ చేయడానికి ,సూర్యాపేట లో జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో లో భాగస్వామ్యం కావడానికి బీఆరేస్ లో కి వచ్చిన భాజపా నాయకులకు మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మునిసిపల్ చైర్మన్ పెరుమాల అనుపూర్ణ, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, కౌన్సిలర్లు సౌమ్య జానీ, జ్యోతి కరుణాకర్, రాజేష్, కుంభం రాజేందర్, టిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కరుణశ్రీ, తండు శ్రీనివాస్, ఈదా ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..