Collector inspects: దేవరకొండ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ
పార్ల మెంటు ఎన్నికల్లో భాగంగా దేవ రకొండ ప్రభుత్వ జూనియర్ కళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్ని కల పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలింగ్ సిబ్బంది హాజరు,ఫోలింగ్ కేంద్రాలకు వెళ్లిపోయిన పోలింగ్ బృందాలు, ఇంకా వెళ్లవలసిన టీములు తదిత అంశాలపై సెక్టోరల్ అధికారులు, జిల్లా అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది కి భోజనం సరిగా ఏర్పా టు చేయలేదని వంట ఏజెన్సీ పై ఆగ్రహం
రిసెప్షన్ కు వంట ఏజెన్సీ మార్చా లని ఆదేశించిన జిల్లా కలెక్టర్
ప్రజా దీవెన, దేవరకొండ: పార్ల మెంటు ఎన్నికల్లో(parliament elections) భాగంగా దేవ రకొండ ప్రభుత్వ జూనియర్ కళా కళా శాలలో(junior college) ఏర్పాటు చేసిన ఎన్ని కల పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలింగ్ సిబ్బంది హాజరు,ఫోలింగ్ కేంద్రాలకు వెళ్లిపోయిన పోలింగ్ బృందాలు, ఇంకా వెళ్లవలసిన టీములు తదిత అంశాలపై సెక్టోరల్ అధికారులు, జిల్లా అధికారుల తో అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్(polling) విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కేసు నమోదు చేయాలని దేవరకొండ నియోజకవర్గం ఆర్డీవో, స్పెషల్ కలెక్టర్ పార్లమెంట్ డిప్యూటీ ఆర్ ఓ నటరాజ్ ను ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన బస్సుల కాన్వాయ్ ను జండా ఊపి ప్రారంభించారు.
పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ సౌకర్యాలు ఎలా ఉన్నా యని, భోజనం ఎలా ఉందని అడుగగా, భోజనం సరిగా లేదని, సాంబార్ భోజనం మాత్రమే పెట్టారని తెలుపగా భోజనం టెంట్ వద్దకు వెళ్లి భోజనాన్ని రుచి చూశారు.
వంట ఏజెన్సీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే వంట ఏజెన్సీని మార్చాలని, రిసెప్షన్ నాటికి వేరే వారికి భోజనం బాధ్యత అప్పగించాలని,తన అనుమతి లేనిదే భోజనానికి సంబంధించిన బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు. రిసెప్షన్(reception) రోజు ఎలాంటి పరిస్థితులలో పొరపాట్లు జరగకుండా సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో నీడ కోసం టెంట్ ,కూలర్లు, తాగునీ రు, వైద్య సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ,ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ హెచ్చరిం చారు .జిల్లా హౌసింగ్ పీడీ ఇన్చార్జి డిటివో రాజ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటే శ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్డీవో శ్రీరాములు, స్థానిక తహసిల్దార్ తదితరులు ఉన్నారు.
Collector inspects Devarakonda election distribution centre