Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Baptist Church: బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా మదర్స్ డే వేడుకలు

స్థానిక నయా నగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ప్రజా దీవెన, కోదాడ: స్థానిక నయా నగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో(Baptist Church) ఆదివారం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్(United Pastors Association) అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలపైతల్లుల ప్రేమ ప్రాముఖ్యతను వివరించారు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడ దొరకదని, తల్లి భర్తకు విధేయురాలుగా ఉండే కుటుంబ అభివృద్ధికి పాటుపడుతుందని, తల్లి పిల్లలకు ఒక టీచర్(Teacher) గా, తల్లి కుటుంబం అంతటికి శ్రమపడి పని చేస్తుందని, తాను చేసిన కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన ద్రవ్యమును దాచిపెట్టి పిల్లలకు కావలసినవి కొని ఇస్తుందని, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటుందని వివరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ తో అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని ఒకరికి ఒకరు పంచుకున్నారు.  ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు శ్రీమతి వంటపాక జానకి ఏసయ్య జ్యోతి సీత సువార్త అప్పిరెడ్డి నాగమణి అరుణ సునీత తదితరులు పాల్గొన్నారు.

Grand Mother’s Day Celebrations at Baptist Church