Election campaign: పర్వం ముగిసిన ప్రచారాల…. ప్రారంభమైన ప్రలోభాల
తెలంగాణలో హోరాహోరీ కొనసా గిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార రథాల హోరు గగ్గోలు, సభలు సమావేశాల్లో ప్రసం గాలు మొత్తానికి ముగిశాయి.
ఓటుకు నోటు విధానంతో ఓటర్ స్లిప్పులకు డబ్బులు
తెలంగాణ వ్యాప్తంగా ఓటుకు సరాసరి వెయ్యితో కొనుగోళ్లు
నేడు తారాస్థాయికి చేరుకోనున్న తాయిలాల పంపిణీ
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో హోరాహోరీ కొనసా గిన లోక్‌సభ ఎన్నికల(Parliament elections) ప్రచారం ముగిసింది. ప్రచార రథాల హోరు గగ్గోలు, సభలు సమావేశాల్లో ప్రసం గాలు మొత్తానికి ముగిశాయి. డప్పు దరువులు, జిందాబాద్ నినాదాలు పూర్తిగా ఆగిపోయాయి. ఎన్నికల సంఘం నిబంధనల(Election Commission Rules) ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రచారాన్ని ముగించుకున్న నేతలు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ఓటర్లకు డబ్బు, మద్యం ప్రవాహాన్ని ముమ్మ రంగా ప్రారంభించారు. ఎన్నికల పర్వంలో ఓటింగ్‌కు ముందు 24 గంటలు ఎంత కీలకమో తెలిసిన నేతలంతా శనివారం సాయంత్రం నుంచే ఓటర్లకు తాయిలాల పంపి ణీ మొదలుపెట్టారు.
ఆర్థికంగా బలమైన అభ్యర్థులున్న చోట, హోరాహోరి పోటీ నెలకొన్న చోట కాస్త ఎక్కువ సొమ్మును పంపిణీ చేస్తుండగా అత్యధిక నియోజకవ ర్గాల్లో తక్కువ మొత్తాలతో సరిపెడు తున్నారు. కుల, యువజన, మహి ళా సంఘాల నాయకులతో ముం దుగానే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం డబ్బులు పంపుతున్నారు. మల్కాజ్‌గిరిలో ఓ కుల సంఘం నాయకులకు ఓ ప్రధాన పార్టీ అభ్య ర్థి రూ.12 లక్షలు ఇచ్చారని ప్రచా రం జరుగుతోంది. పలు బస్తీల్లో ఓటు కు రూ.500 నుంచి రూ. 1000చొప్పున ప్రధాన పార్టీ నేతలు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని ఒక్కో నియో జకవర్గంలో 30 వేల నుంచి 50 వేల మంది ఓటర్లకు రూ.500 పై చిలుకు నగదు ఇస్తున్నారు.
చేవెళ్లలో(chevella) ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేస్తున్నట్లు సమా చారం. మల్కా జిగిరి, మెదక్, ఖమ్మం, జహీరా బాద్‌లో రూ.500, 1000 చొప్పున పంపిణీ సాగుతు న్నట్టు తెలిసింది. ఇక, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్ల గొండ, మహబూబ్‌నగర్‌లో రూ. 500 చొప్పున పంచుతున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, భువనగిరి, మహ బూబాబాద్ వంటి నియోజకవర్గా ల్లో పంపిణీ ఛాయలు పెద్దగా కని పించకపోయినాగ్రూపుగా వచ్చి అడిగే ఓటర్లకు ఎంతో కొంత ముట్టజెప్తున్నట్లు తెలిసింది. ము ఖ్యంగా మహిళా సంఘాలకు కొంత మొత్తం చొప్పున పార్టీలు అంద జేస్తున్నాయి. ఆదివారం రాత్రికి పంపిణీలో కాస్త జోరు పెరగవచ్చని అంటున్నారు.
జహీరాబాద్ పరిధిలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి.. నాయకుల ద్వారా ఓటర్ల వివరాలు తెలుసుకుని ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నాయకుల ఫోన్ల నుంచి ఓటర్ల బ్యాంకు ఖాతాలకు రూ.500చొప్పున బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ముషీరాబాద్ అచ్చయ్యనగర్‌లో ఓ పార్టీ బస్తీ నాయకుడు ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. మళ్లీ డబ్బులోస్తే రెండో విడత కూడా చెల్లింపులు ఉంటాయని చెబుతు న్నారు. మెదక్ పార్లమెంట్(Medak parliament)సెగ్మెంట్ పరిధిలోని రామచంద్రాపురం పట్టణం బొంబాయి కాలనీలో ఓటర్లకు బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ నేతలు వారిని పట్టుకు న్నారు. శనివారం మధ్యాహ్నం కొందరు బీఆర్‌ఎస్ నాయకులు కారు, ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు, యువత వారిని పట్టుకున్నారు. ఈ వీడి యోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Elections campaign closed