Big encounter: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్ ఘడ్ లోని సెమ్రా ప్రాంతం లో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.
ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం
ప్రజా దీవెన, ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్ ఘడ్ లోని సెమ్రా ప్రాంతం లో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. సుక్మా జిల్లా బోటెతం గో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో భద్రతాద ళాలు అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. భద్ర తా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఎనిమి ది మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Big encounter in Chhattisgarh