Vote: వావ్ వారుంటే గెలుచేయొచ్చు
వావ్ ఇది అద్భుతమే ఎందుకంటే అందర్నీ సంభ్రమాచార్యాలకు గురి చేసే విషయం కాబట్టి. లోక్ సభ ఎన్నికలవేళ అందర్నీ ఆశ్చర్యపరిచే అంశం లో ప్రస్ఫుటమైంది.
ఒకే కుటుంబంలో 1200 మంది ఓటర్లు
ప్రజా దీవెన, అస్సోం: వావ్ ఇది అద్భుతమే ఎందుకంటే అందర్నీ సంభ్రమాచార్యాలకు గురి చేసే విషయం కాబట్టి. లోక్ సభ ఎన్నికలవేళ అందర్నీ ఆశ్చర్యపరిచే అంశం లో ప్రస్ఫుటమైంది. లోక్ సభ ఎన్నికల(Lok sabha elections) వేళ అస్సాంలోని(assam) సోనిట్ పూర్ జిల్లా నేపాలి పామ్ గ్రామం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షి స్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లున్నారు. వీరిని ఆకట్టుకుంటే ఎన్నికల్లో అట్టే గెలిచేయొచ్చు అన్న నమ్మకం కూడా కలగక మానదు. దీంతో వారిని ప్రసన్నం చేసుకు నేందుకు రాజకీయ నేతలు గ్రామా నికి క్యూ కట్టారు. గ్రామంలోని 300 కుటుంబాలు ఒకే వంశానికి చెంది నవే. వారంతా రాన్ బహదూర్ తాపా వారసులు. ప్రస్తుతం వారి సంఖ్య 2500 ఉండగా, అందులో 1200 మంది ఓటర్లున్నారు. ఐదు గురు భార్యలున్న ఆయనకు 12 మంది కొడుకులు, 10 మంది కుమార్తెలు సంతానం. ఇప్పు డు వారి సంఖ్య 2500కు చేరడం విశేషం.
1200 voters in one family