ఇకపై తక్కువ వేగానికి కూడా జరిమానా..!
–– ఎక్స్ ప్రెస్ , జాతీయ రహదారులపై వేగానికి వర్తింపు
ప్రజా దీవెన /న్యూ ఢిల్లీ:ఎక్స్‌ప్రెస్ హైవే, జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని స్పీడ్ కంట్రోల్ అమలుపర్చడం చూసాము. కానీ ఇప్పటి నుంచి తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే కూడా జరిమానా వేస్తారట అని కొత్తగా వింటున్నాము..నిజమే మరి…
అధిక వేగంతో ప్రయాణిస్తూ స్పీడ్ గన్ కు చిక్కితే నేరుగా ఇంటికే పోలీసులు చలాన్ పంపే వారు. ఇకపై తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే కూడా జరిమానా వేస్తారు …వినడానికి కొంత వింతగా ఉన్నా ముమ్మాటికీ నిజం. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో నెమ్మదిగా డ్రైవ్ చేసే వారు ఇతరులను ఇబ్బంది గురిచేస్తున్నారని అందుకు వారికి రూ. 2000 వరకు చలాన్ వేస్తున్నారు.వాస్తవానికి, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో నెమ్మదిగా డ్రైవింగ్ చేసినందుకు మీరు రూ. 2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ రూల్ యాక్ట్ కింద రూల్స్ కొన్ని మార్పులు చేశారు. ఎక్స్‌ప్రెస్‌వేపై చిపియానా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించిన తర్వాత నిబంధనలు అమలు చేయబడుతూ దీని కింద ఓవర్‌టేకింగ్ సమయంలో నిర్ణీత వేగం లేకపోతే రూ.500 నుంచి రూ.2000 వరకు చలాన్ వసూలు చేస్తారు.ఈ కొత్త నిబంధనకు సంబంధించి, NHAI నిపుణుడు సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు.
ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రజలు నిర్దేశించిన వేగ పరిమితి కంటే తక్కువగా డ్రైవ్ చేస్తారు. దీంతో వాహనాలు ఓవర్టేక్ చేసే అవకాశం లేదు. వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుని ఓవర్‌టేకింగ్ లైన్లో నెమ్మదిగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని నిబంధన పెట్టారు.
ఈ నిర్ణయం ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు సులభంగా ఓవర్ టెక్ చేసి ప్రమాదాలను నివారించగలగాలి. డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి NHAI ద్వారా ఒక ప్రకటన కూడా జారీ అయింది.