Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SBI recruitment: ఇంజనీర్ లకే ఇష్టబంతి

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలోని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ)(SBI) పెద్దఎత్తున ఉద్యోగుల(SBI Bank recruitment) నియామకానికి సన్నద్ధ మవుతోంది.

ఎస్బిఐ లో కొలువుల జాతరకు సన్నద్ధం
ఆర్థిక సంవత్సరంలో 12 వేల నియామకాలకు శ్రీకారం
వీటిల్లో 85 శాతం కొత్త ఇంజనీరిం గ్‌ గ్రాడ్యుయేట్ల కే అవకాశం

ప్రజా దీవెన, ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలోని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ)(SBI) పెద్దఎత్తున ఉద్యోగుల(SBI Bank recruitment) నియామకానికి సన్నద్ధ మవుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవ త్సరం 2024–25 కి గాను ఏకంగా 12,000 నియామకాలు ఉంటాయ ని బ్యాంక్‌ చైర్మన్‌ దినేశ్‌ ఖారా(Bank Chairman Dinesh Khara) ప్రకటించారు. ఆయన ప్రకటించిన ఉద్యోగాల్లో 85 శాతం మంది ఇంజ నీరింగ్‌ గ్రాడ్యుయేట్ల కే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఐటీ రంగం లో ఫ్రెషర్స్‌ నియామకాలు తగ్గిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఇలా పెద్దఎత్తున ఇంజనీర్ల నియామ కానికి సిద్ధమవడం విశేషం.

ప్రొబే షనరీ ఆఫీసర్లు, అసోసియేట్ల పోస్టు ల్లో ఈ నియామకాలు ఉంటాయని ఖారా చెప్పారు. కొత్త ఉద్యోగులకు ముందుగా బ్యాంకింగ్‌ విధి విధా నాల్లో శిక్షణ ఇస్తామని తర్వాత వారి యోగ్యత, ఆసక్తిని బట్టి ఐటీ, వివిద వ్యాపార బాధ్యతల్లో నియమిస్తామని చెప్పారు. ఈ తరహా విధానం వల్ల బ్యాంక్‌కు నిరంతరం టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు అందు బాటులో ఉంటాయని చెబుతు న్నారు. సరికొత్త టెక్నాలజీతో ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు పోటీపడుతున్న సమయంలో ఎస్‌బీఐ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నియామకాలపై దృష్టి పెట్టడం గమనార్హం.

సాంకేతికత కీలకం: బ్యాంకుల నిర్వ హణకు సాంకేతికత(Technology) అత్యంత ముఖ్యమని ఎస్‌బీఐ చైర్మన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ రూ ఈ విషయాన్ని ఏ మాత్రం విస్మరించలేరన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా ఎప్పటి కప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ టెక్నాలజీ వినియోగంలో వెనకబడిన బ్యాంకులపై పెనాల్టీలు విధిస్తున్న విషయాన్ని ఖారా గుర్తు చేశారు.

అదే సందర్భంలో టెక్నా లజీ అప్‌గ్రేడేషన్‌ కోసం ఎస్‌బీఐ(SBI) ఎంత ఖర్చు చేస్తోందన్న విషయాన్ని వెల్లడించేందుకు దినేశ్‌ నిరాకరిం చారు. అయితే ఇది ఇతర బ్యాం కుల కంటే ఎక్కువే ఉంటుంద న్నారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చుల్లో సగటున 7 నుంచి 8 శాతం టెక్నాలజీ అప్‌గ్రే డేషన్‌ కోసం ఖర్చు చేస్తున్నాయి. అయితే ఎస్‌బీఐ చైర్మన్‌ మాటలను బట్టి చూస్తే బ్యాంక్‌ ఇంత కంటే ఎక్కువే ఖర్చు చేస్తోందని భావించాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

SBI Bank recruitment