Hoarding collapsed: ముంబైలో కూలిన భారీ హోర్డింగ్
ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం సా యంత్రం గాలి దుమారం, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు, వర్షం మూలం గా ఘట్కోపర్ ప్రాంతంలో 100 అడుగుల ఎత్తైన అక్రమ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై కుప్ప కూలింది.
గాలి దుమారంతో హోర్డింగ్ కుప్పకూలి 14మంది మృతి, 74 మందికి గాయాలు
ప్రజా దీవెన,ముంబై: ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం సా యంత్రం గాలి దుమారం, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు, వర్షం మూలం గా ఘట్కోపర్ ప్రాంతంలో 100 అడుగుల ఎత్తైన అక్రమ హోర్డింగ్(e hoarding ) పక్కనే ఉన్న పెట్రోల్(Petrol pump) పంపుపై కుప్ప కూలింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా 74 మందికిపైగా గాయాలపాలయ్యారు. హోర్డింగ్ కింద చిక్కుకున్నవారిని కాపా డేందుకు అధికారులు యుద్ధప్రాతి పదికన సహాయ చర్యలు చేపట్టా రు.
హోర్డింగ్(Hoarding) కూలిన ప్రాంతాన్ని సీఎం శిందే సందర్శించారు. మృతు ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పు న పరిహారాన్ని ప్రకటించారు. ప్రతికూల వాతావరణం, గాలిదు మారం నేపథ్యంలో ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసు లను 66 నిమిషాల పాటు నిలిపి వేశారు. వర్షాల కారణంగా లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. కాగా బలమైన గాలులు, వర్షంతో వడాలా ప్రాంతంలో నిర్మా ణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవ ర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘట నలో ముగ్గురికి గాయాలయ్యాయి.
Huge hoarding collapsed in Mumbai