Local Parties: కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్ప దని, ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతి రేకత ఉందని బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.
బిజెపి కి పరాభవం తప్పదు
మీడియాతో మాజీ సీఎం కేసిఆర్
ప్రజా దీవెన, సిద్దిపేట: లోక్ సభ ఎన్నికల్లో(Lok sabha elections) బీజేపీకి(BJP) పరాభవం తప్ప దని, ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతి రేకత ఉందని బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగిస్తా యని అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో సోమవారం ఓటు వేసిన అనంతరం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరే కత ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రాం తీయ పార్టీలే కీలకంగా మారను న్నాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president ktr)అన్నారు. ఓటువేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు బయటకు వచ్చి ఓటు వేయడం వల్ల దేశాభివృద్ధికి నాంది పలికినట్టు అవుతుందన్నారు.కాగా, ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. ఓటు వేసిన తర్వా త ఆయన మీడియాతో మాట్లా డుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కు వగా పోలింగ్ నమోదవుతుందని, పట్టణాల్లోనూ గతంలో కంటే ఎక్కు వ నమోదు కావడం సంతోషదా యకమన్నారు.
Regional parties form government