chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యo
ఆంధ్రప్ర దేశ్ లో గడిచిన ఐదేళ్ల పరిపాలనా పరంగా, తాజాగా లోక్ సభ ఎన్నిక ల పోలింగ్ సందర్భంగా వైసీపీ వ్యవహార శైలితో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయు డు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటమిని తట్టుకోలేక ప్రజలపై దాడులకు తగబడుతున్నారు
అసహనంతో అడ్డగోలుగా వీరంగం సృష్టిస్తున్నారు
క్కడికక్కడ ఎన్నికల నియమావ ళిని ఉల్లంఘిoచారు
మీడియాకు విడుదల చేసిన ప్రక టనలో వైసీపీపై చంద్రబాబు ధ్వజం
ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్(Andhra Pradesh) లో గడిచిన ఐదేళ్ల పరిపాలనా పరంగా, తాజాగా లోక్ సభ ఎన్నిక ల పోలింగ్ సందర్భంగా వైసీపీ వ్యవహార శైలితో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయు డు ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి(YCP) అరాచకాలను ప్రజాస్వామ్యవాదు లoదరు లందరు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నా రు. అరాచక, అవినీతి పాలనకు గుడ్ బై చెప్పేందుకు ప్రజలు ఎంత గా ఎదురు చూస్తున్నారో తెల్లవారు జామునుండే ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో ఎదరుచూస్తున్న ప్రజలే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
మంగళవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుతో ఓటమి కళ్లకు కనిపిస్తుండడంతో, వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దాడు లకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసహనంతో అడ్డ గోలుగా వీరంగం సృష్టిస్తూ, అడ్డదా రులు తొక్కుతూ, అక్రమాలకు పాల్పడు తూ ప్రజాస్వా మ్యానికి ప్రమాద కరంగా మారారని ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కూటమి అభ్యర్థు లతో పాటు మీడియాపై, పోలీసు లపై కూడా దాడులకు పాల్పడుతు న్నారనీ చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు. మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులకు తెగబడుతూ ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
దేశ చరిత్రలో ఎన్నడూ మహిళలపై, పిల్లలపై దాడులు జరిగిన ఘటనలే లేవని, కళ్ల ముందు ఘోర పరాజయం కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్నా రు. మాచర్లలో టీడీపీ(TDP) నేత జూల కంటి బ్రహ్మారెడ్డితోపాటు వందల సంఖ్యలో కార్యకర్తలను రక్తం వచ్చే లా దాడి చేశారని, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయ లుపై వైసీపీ మూకలు దాడి చేసి, కార్లను ధ్వంసం చేశారని చెప్పారు.తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు టీడీపీ నేతల పై, ఓటర్లపై కూడా దాడులకు పాల్పడడం హేయమన్నారు. గుం టూరు(Guntur)ఎంపీ అభ్యర్ధి కిలారు రోశ య్యను అభివృద్ధి గురించి ప్రశ్నించి నందుకు మహిళలపైకి కారుతో దూసుకెళ్లడం వైసీపీ నేతల దుర హం కారానికి నిదర్శనం అని చంద్ర బాబు మండిపడ్డారు.
చీరాలలో టీడీపీ అభ్యర్థి కొండయ్యపై, శ్రీకా కుళం అభ్యర్థి గొండు శంకర్‌పై పోలింగ్ బూత్ వద్దే దాడికి పాల్ప డడం దుర్మార్గం అని ఆవేదన వ్య క్తం చేశారు. తిరువూరు నియో జకవర్గం కంభంపాడులో కేశినేని చిన్ని బృందంపై వైసీపీ మూకలు వెంటాడి మరీ దాడి చేసి కార్లు ధ్వంసం చేశారని, పోరంకి పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువగా వేస్తున్నారని జోగి రమేష్ తనయుడు రాజీవ్ ఏకంగా పోలింగ్ ఆపేయాలంటూ హడావుడి చేశారని అన్నారు. ఇలా ఎక్కడి కక్కడ ఎన్నికల నియ మావళిని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నారనీ తెలిపా రు.క్యూలలో నిలబడి ఓటు హక్కు ను వినియోగించుకోవడం ప్రభు త్వంపై(government)ఉన్న వ్యతిరేకతను స్పస్టం చేస్తుందని చెప్పారు.
వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించినా ప్రజలు లెక్కచేయకుండా ప్రజలు నిర్భయంగా ఓటింగ్(Voting)లో పాల్గొంటు న్నారని ప్రశంసించారు. వేలిపై సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్క లు పడేలా చేస్తున్న వైసీపీ నేతలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. ఇక తెనాలి లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ దాడిపై కూడా స్పందిం చారు. క్యూలో రమ్మని చెప్పిన ఓటర్‌పై ఎమ్మెల్యే(MLA) దాడి చేయడం దుర్మార్గమని దాడులు, దౌర్జన్యాల తో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ వ్యతిరేకపవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
ఓటమి ఖాయమని తెలియడంతో వైసీపీ అల్లర్లకు తెగబడుతుందని ఐదేళ్ల దౌర్జన్య కాండను ఎన్నికల వేళ కొనసాగిస్తూ దాడులకు పాల్పడటం ముందస్తు ఓటమిని వైసీపీ ఒప్పు కోవడమేనని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. పుంగనూరు, మాచర్ల, రైల్వే కోడూరు, మైదుకూరు, ఆము దాల వలస, తాడికొండలో కూటమి ఏజెంట్లపై దాడులను తీవ్రంగా స్పం దించారు. బాధ్యులపై కఠిన చర్య లు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ కుట్ర లను తిప్పికొ ట్టాలని ప్రజలకు చంద్రబాబు ట్విట్ట ర్ వేదికగా పిలుపునిచ్చారు.
Democracy ridicule in Andhra Pradesh