Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chilakaluripeta incident : అర్థరాత్రి అగ్నికీలలకు ఆహుతైన బస్సు

--టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువుతో ఆర్తనాదాలు --చిలకలూరి పేట వద్ద రోడ్డు ప్రమాదoలో ఆరుగురు సజీవ దహనం --పదుల సంఖ్యలో కాలిన గాయాల తో క్షతగాత్రులైన వైనం

అర్థరాత్రి అగ్నికీలలకు ఆహుతైన బస్సు

–టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువుతో ఘోర ప్రమాదం
–చిలకలూరి పేట రోడ్డు ప్రమాదoలో ఆరుగురు సజీవదహనం 
–పదుల సంఖ్యలో కాలిన తీవ్రగాయాలతో క్షతగాత్రులైన వైనం

ప్రజా దీవెన, చిలకలూరి పేట:పర్చూరు..సొంతూరిపై మమకారం ఆపై ఓటు వేయాలని దృఢ సంక ల్పం వెరసి పిల్లా, పెద్దా అందరూ కలిసి స్వస్థలాలకు విచ్చేశారు. అనుకున్న విధంగా త్రికరణశుద్ధితో బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. బంధు మిత్రులతో రెండు మూ డు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొం డంత ఆశతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.

అంత లోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవరు తో సహా అరు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచే లోపే అగ్ని కీలలకు ఆహుతైన విషాద సంఘటన చిలకాలూరిపేట సమీపంలో చోటు చేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికు లను తీవ్ర గాయాలపాలుజేసింది.

క్షతగాత్రుల ఆర్తనాదాలు మి న్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై 108, పోలీ సులకు సమాచా రం చేరవేయడంతో ప్రాణనష్టం తగ్గిం ది. స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లాచినగంజాం నుంచి పర్చూ రు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్ర యాణికులతో బయలుదేరింది.

వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం ప్రాంతాలకుచెందిన వారే ఎక్కువ గా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైద రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూ రిపేట మండలం అన్నంబట్ల వారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్ద కు చేరుకునేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌ బస్సును బలంగా ఢీ కొట్టింది.క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి.

తేరుకునేలోపే తెల్లారిన బతుకులు.. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రా వెల్స్‌ బస్సు చోదకుడు, మరో ఆరుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్త నాదా లు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది.

స్థానికులు దుర్ఘటన సమాచా రాన్ని 108, పోలీసులకు చేరవేయ డంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగా త్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

చిలక లూరిపేట నుంచి అగ్నిమాపక శక టం వచ్చి మంటలు ఆర్ప డంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్‌ వర్క్‌ జరుగుతుండ టం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరు కుపోవడం, టిప్పర్‌ వేగంగా దూసు కురావడం, టిప్పర్‌ చోదకుడు వేగా న్ని నియంత్రించ లేకపో వడం ప్రమా దానికి కారణమైనట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Chilakaluripeta incident