Tinmar Mallanna:తీన్మార్ మల్లన్న విజయం ఖాయం
నల్ల గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తీన్మార్ మల్ల న్న విజయం ఖాయం అని నల్ల గొండ జిల్లా మున్నూరుకాపు మహా సభ ప్రధాన కార్యదర్శి నాగులంచి స్వామీ ధీమా వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా మున్నూరుకాపు మహాసభ ప్రధాన కార్యదర్శి నాగులంచి స్వామీ
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్ధి తీన్మార్ మల్ల న్న(Tinmar Mallanna) విజయం ఖాయం అని నల్ల గొండ జిల్లా మున్నూరుకాపు మహా సభ ప్రధాన కార్యదర్శి నాగులంచి స్వామీ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27 వ తేదీ జరుగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో మున్నూరు కాపు కుల బంధువు తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజా రిటీతో గెలిపించుకునేందుకు మహా సభ ఆధ్వర్యంలో విస్త్రుత స్ధాయి లో పట్టభద్రులను కలసి ఓట్లు అభ్య ర్ధిస్తామని చెప్పారు.
ప్రజా సమస్య లపై సంపూర్ణ అవగాహన కలిగిన తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో(Elections) గెలిచి మండలికి ఎన్నికైతే సమాజానికీ ఎంతో హితోధిక సహాయంగా ఉం టుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మల్లన్న గెలుపు ప్రతి ఒక్క మున్నూరు కాపు కులస్థుడు తమ వంతు బాధ్యతగా ఈ నెల 27 వ తేదీన జరగబోయే పోలింగ్(Polling) కు స న్నద్ధం కావాలని కోరారు. తీన్మార్ మల్లన్న కు ప్రతీ ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Tinmaar mallanna wins in mlc elections