Communist: సమాజ మార్పు కోసం పోరాడే వారే కమ్యూనిస్టులు
దోపిడీ, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడే వారే కమ్యూనిస్టులు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు
అమరుల ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి
నన్నూరిఅంజిరెడ్డి సంతాప సభలో తమ్మినేని పిలుపు
ప్రజాభిమానాన్ని పొందడమే నిజమైన జీవితం
సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
ప్రజా దీవెన నల్లగొండ: దోపిడీ, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడే వారే కమ్యూనిస్టులు(Communist) అని సిపిఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం తిప్పర్తి మండలం ఏ దుప్పలపల్లి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన అంజిరెడ్డి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. వారి ఆశయాలు, ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని అన్నారు.
కమ్యూనిస్టులు(Communist) ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని మానవ సమాజానికి కూడు, గూడు, ఉపాధి, ఉచిత విద్యా, వైద్య సదుపాయాలు అందడం కోసం పనిచేస్తారని గుర్తు చేశారు. రాజకీయాలలోకి బడా కార్పొరేట్ కంపెనీ అధినేతలు చొరబడి కలుషితం చేశారని ఆరోపించారు. ప్రస్తుత సమాజంలో ఉపాధి కరువై కనీస వేతనాలు అందక విద్యా, వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితికి ఏర్పడిందని ఆవేదన చెందారు. అందరికీ ఉచిత విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించగలిగే దోపిడీ రహిత సమసమాజ నిర్మాణం చేయాలని కోరారు.
రాజకీయ నాయకులు అవినీతిపరులుగా మారి ప్రజలకు డబ్బు, మద్యం, కులం, మతం ప్రాంతాలు అంటూ ప్రజలను రెచ్చగొడుతూ పదవులు పొంది, ధరలు పెంచి ఉపాధి కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ తన మరణానంతరం వారి పార్దివ దేహాన్ని మెడికల్ విద్యార్థుల(Medical students) వైద్య విద్య కోసం హాస్పిటల్ కు అందజేయడం అభినందనీయమని అన్నారు.సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి గత 40 సంవత్సరాలుగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలలో పనిచేస్తూ పేదలకు పంచరాయి భూములు పంపిణీ, పాలేరులకు సంఘాలు పెట్టి జీతాలు, వ్యవసాయ కార్మికుల కూలీరేట్ల పెంపు కోసం అనేక ఉద్యమాలు నిర్మించారని అన్నారు.
మానవులు పుట్టడం మరణించడం సహజమని ఈ మధ్యకాలంలో ప్రజల కు సేవచేసి వారి అభిమానాన్ని పొందడమే నిజమైన జీవితమని, అది అంజిరెడ్డి ప్రజాభిమానాన్ని పొందాడని కొనియాడారు. తన ఇల్లుని సిపిఎం కార్యాలయంగా మార్చుకుని పేదలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాల ద్వారా అనేకమందినీ సిపిఎం కార్యకర్తలుగా వారి కుటుంబ సభ్యులను సిపిఎం పార్టీ నాయకులుగా తీర్చిదిద్దడం ఎంతో అభినందనీయమని అన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, సయ్యద్ హశిం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, గంజి మురళీధర్, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, మండల కార్యదర్శి మన్నెం బిక్షం, కుటుంబ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి కీర్తి, మందడి సువర్ణ, నన్నూరి కౌసల్యమ్మ, సిపిఎం తిప్పర్తి మండల నాయకులు బిరెడ్డి సీతారాం రెడ్డి, భీమగాని గణేష్, ఆకిటి లింగయ్య, శశిధర్, చెనగోని వెంకన్న, జంజరాల ఉమా, యండి. లతీఫ్, గండమళ్ళ రాములు, దోంగరి వెంకన్న, భీమగాని శ్రీనివాసులు, మైల సైదులు, వంగల యాదగిరి రెడ్డి, శివలింగం, అశోక్ రెడ్డి, గంజి రాములు, శ్రీనివాస్ రెడ్డి, గండమల్ల యాదగిరి, సంజీవరెడ్డి, కోట్ల గోవర్ధన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నల్పరాజు యాదయ్య, శంకర్, శరత్, బిక్షం, శ్రీను, లింగయ్య, బ్రహ్మచారి, శంకరాచారి, తదితరులు పాల్గొన్నారు.
Communists fight for social change