ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలి: బొల్లం మల్లయ్య యాదవ్
ప్రజా దీవెన, కోదాడ: ఈనెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLC elections) బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కోదాడ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి బొల్లం మల్లయ్య యాదవ్, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కటికం సత్తయ్య గౌడ్ లు అన్నారు. గురువారం కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను చైతన్య పర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను యువతలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్(BRS candidate) అభ్యర్థి పోరాడుతారన్నారు. యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందన్నారు. విద్యావంతుడు యువకుడు టిఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి నీ గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేయాలన్నారు. నమోదైన పట్టభద్రులను ఇంటింటికి తిరిగి కలిసి చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. నల్లగొండ, ఖమ్మం ,వరంగల్ శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు, అన్ని స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
work for BRS candidate victory in MLC elections