Ponnam prabhakar: ఉచిత బస్సు ప్రయాణం పై మోదీ దిగజారి వ్యాఖ్యలు
హి ళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని మోదీ ప్రధాని జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి పొన్నం ప్రభా కర్ గౌడ్ మండిపడ్డారు.
మెట్రోకు, బస్సు ప్రయాణంకు సంబంధం ఉండదు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ప్రజా దీవెన, హైదరాబాద్: మహి ళలకు ఉచిత బస్సు(Free bus) ప్రయాణంపై ప్రధాని మోదీ ప్రధాని జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి పొన్నం ప్రభా కర్ గౌడ్(Ponnam prabhakar) మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం పై ప్రధాని మోదీ ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్య లపై మంత్రి పొన్నం స్పందించారు. ఇలా చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చవద్దని హిత వు పలికారు. కొన్ని రాష్ట్రాలు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తు న్నాయని, ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని, ఇప్పటికి కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తు న్నామని గుర్తు చేశారు.
మోదీ(modi) రాజకీయ లబ్ధికి సంబంధించి మాత్రమే ఆలోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండబోధని, ఇం కా కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకు పోతామని ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇలా చిన్న అంశా లపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చవద్దని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.
Modi worst comments on free bus