Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

School: పాఠశాలలు ప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలి

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులన్నింటిని పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

విద్యార్థులకు జత బట్టలు తప్పనిసరిగా ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశం

ప్రజా దీవెన నల్గొండ:  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులన్నింటిని పాఠశాలలు(school) పునః ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆమె హైదరాబాద్(hyderabad) నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో పనులు చేపట్టడం వల్ల పాఠశాలలో ఎంతో పురోగతి కనిపిస్తున్నదని, అన్ని జిల్లాలలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్ పంపిణీ పై మాట్లాడుతూ 17 జిల్లాలకు బట్టలు పంపించడం జరిగిందని, తక్కిన జిల్లాలకు ఈ నెల 20 లోగా అందజేస్తామని, అన్ని జిల్లాలలో పాఠశాలల(school) ప్రారంభం నాటికి కనీసం ఒక జత డ్రెస్ అయినా కుట్టించి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పారు.

ధరణిలో(dharani) పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని, అలాగే ప్రజావాణి పిటిషన్లు సైతం పరిష్కరించాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు లో భాగంగా మిగిలిపోయిన ధాన్యం సేకరణను వెంటనే పూర్తి చేయాలని అలాగే ధాన్యాన్ని సైతం త్వరగా లిఫ్ట్ చేసేలా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్(collector) దాసరి హరిచందన, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఈఓ భిక్షపతి,డిఆర్డిఓ నాగిరెడ్డి, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు, డిసిఓ కరుణాకర్, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

work completed before schools start