Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Investments: రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు

రాబోయే కాలంలో రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు రాబట్టేం దుకు ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టు బడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

వేలాది కోట్ల రాబట్టేందుకు విస్త్రుత స్ధాయి ప్రయత్నాలు
ప్రపంచస్థాయి ప్రమాణాలతో మూసీ అభివృద్ధి
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రాపర్టీ షోలో ఉత్తమ్, శ్రీధర్ బాబు

ప్రజా దీవెన, హైదరాబాద్: రాబోయే కాలంలో రాష్ట్రానికి సుమారు 20వేల కోట్ల పెట్టుబడులు( investments) రాబట్టేం దుకు ఒప్పందాలు జరిగాయని, వచ్చే నాలుగేళ్లలో వేల కోట్ల పెట్టు బడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబా ద్ మహానగర రియల్ ఎస్టేట్ అభి వృద్ధికి దోహదపడేవిధంగా మెట్రో రైలును శివారు ప్రాంతాలకు విస్తరిస్తామని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబి షన్ సెంటర్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్(Indian Green Building Congress) (ఐజీబీసీ) ప్రాపర్టీ షోను శుక్రవారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హరితభవనాల అవస రం చాలా ఉందన్నారు.

గ్రీన్ బిల్డింగ్ పద్ధతి రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని, ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని తెలి పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నా మని వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తృతం గా అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) నాయకత్వంలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్త పాలసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని, దీర్ఘకాలిక వ్యూహాల తో ముందుకు వెళుతున్నామన్నా రు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టామని, ఐటీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నా యని, దీనివల్ల ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశా లు లభిస్తాయన్నారు. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

Big investments to telangana