Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cabinet meeting: మంత్రి మండలికి పచ్చజెండా

తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వ హణకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది.

షరతుల కూడిన అనుమతి
ఎన్నిక ప్రక్రియలో పాత్రలేని అధికా రులకే అనుమతి

 

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్(cabinet meeting)సమావేశ నిర్వ హణకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని సీఈసీ(CEC) షరతులు పెట్టింది.జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని కండిషన్ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరా బాద్‌ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్ని కల సంఘం షరతులు విధించింది.

ఎన్నికల ప్రక్రి యలో భాగస్వాములు అయిన అధికారి ఎవరూ కేబినెట్(cabinet meeting) సమా వేశానికి హాజరు కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించారు. కానీ సీఈసీ(CEC) అనుమతి లభించక పోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా షరతులు విధించి కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికలసంఘం అనుమతులు జారీ చేసింది.

EC green signal cabinet meeting