Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Employment Guarantee Act Protection: ఉపాధి హామీ చట్ట రక్షణ మండల సదస్సులు

పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగారిచి నిర్వీర్యం చేస్తుందని చట్టాన్ని రక్షించుకోవా ల్సిన బాధ్యత ఉపాధి కార్మికులపై ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య కోరారు.

వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని(Employment Guarantee Act Protection ) మోడీ ప్రభుత్వం(Modi govt) నీరుగారిచి నిర్వీర్యం చేస్తుందని చట్టాన్ని రక్షించుకోవా ల్సిన బాధ్యత ఉపాధి కార్మికులపై ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య కోరారు. మంగళవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొనీ ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టరక్షణ కోసం ఈనెల 28 29 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మండల సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఈ సదస్సులో వేలాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టానికి(Employment Guarantee Act Protection ) నిధులు గురించి క్రమేపీ చట్టం లేకుండా చేస్తున్నాడని మోడీ విధానాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలోకి యంత్రాలు రావడంతో పని దినాలు తగ్గిపోయాయని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మికులు ఉపాధి పై ఆధారపడి జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు.  2014 ఎన్నికల ముందు మోడీ. స్విస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి భారతీయుల అకౌంట్లో ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి పది సంవత్సరాలు గడిచింది ఓట్లు వేయించుకున్నారు.ఎన్నికల్లో గెలిచాక ఒక్కరి అకౌంట్లో ఒక రూపాయి వేసింది లేదని, విమర్శించారు. మతం పేరుతో కాలం వెళ్ళదీస్తున్న మోడీ స్విస్ బ్యాంకు నుండి నల్లధనం తెచ్చింది లేదు.

కనీసం నల్లధనాన్ని దాచుకున్న వారి పేర్లను బయట పెట్ట లేదుని. మతం పేరుతో దేశంలో ఉన్న 8o% శాతం హిందువులను మోసం చేస్తూ జిఎస్టి(GST) పేరుతో నిత్యవసర సరుకులపై పాల ప్యాకెట్లపై &పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి,అచ్చేదిన్ ఆయేగా అని చెప్పిన మాటలు ఏమాయ్యాయని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఈ దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని చెప్పిన ఆయన అధికారంలో కి వచ్చేనాటికి 2:30 కోట్ల నిరుద్యోగులు ఈరోజు 14 కోట్లకు పెరిగిపోయారని ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడుస్తున్న పరిశ్రమలన్నీ మూత వేసి సుమారు 18 1/2 కోట్ల మందిని నిరుద్యో గుల్ని తయారుచేసిన ఘనత మోడీ(Modi govt) ప్రభుత్వాన్నిదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28 29 30 తేదీల్లో జరుగు ఉపాధి హామీ చట్ట రక్షణ సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశం లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య జిల్లా నాయకులు దండెంపల్లి సరోజ. కత్తుల లింగస్వామి. కంబాలపల్లి ఆనంద్. మన్నె బిక్షం. వుడుగుండ్ల రాములు. చింతపల్లి లూర్డు మారయ్య. గండమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

Employment Guarantee Act Protection Mandal Conferences