Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న విజయం ఖాయం
నల్లగొండ- వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో(Graduates MLC elections) గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను(Teenmar Mallanna) గెలిపించాలని టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ కోరారు.
టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ- వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో(Graduates MLC elections) గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను(Teenmar Mallanna) గెలిపించాలని టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ కోరారు. మంగళవారం నల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా అనేక సమస్య లపై పోరాటం చేస్తూ వస్తున్నాడని అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై అతనికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
గతంలో కూడా ఎమ్మెల్సీ గా పోటీ చేసి కొద్ది తేడాతో ఓటమి చెందాడని అన్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని చట్టసభలకు పంపిస్తే నిరుద్యోగుల గొంతుక అవుతాడని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఆలోచించి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయా లని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్(Graduates MLC elections) ఓటర్లంతా ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నను(Teenmar Mallanna) మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్,నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నాంపల్లి నరసింహ,న్యాయవాదులు మేడ మోహన్ రెడ్డి, లింగంపల్లి శ్రీను, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఉమా శంకర్, కన్వీనర్లు నల్లగంటి రాంబాబు,పొన్నం రవీందర్, జిల్లా రమణారావు,పసుపులేటి ప్రసాద్, సత్యనారాయణ, నాంపల్లి భాగ్య తదితరులు పాల్గొన్నారు.
Teenmar Mallanna win in Graduates MLC elections