Congress leaders: ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఆరోపణలు అవాస్తవం
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బిజెపి ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్ పై ఆరోపణలు.
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి…..
మతిస్థిమితం కోల్పోయి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు.
ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పై బిజెపి ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్పార్టికార్యాలయంలోఏర్పాటుచేసిన విలేకరుల(Journalist) సమావేశంలో వారు మాట్లాడుతూ నిస్వార్ధంగా, నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పై రాజకీయ లబ్ధి కోసం బిజెపిఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిఆరోపణలు చేస్తున్నారని. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా,రెండుసార్లు కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో మంత్రిగా నిస్వార్ధంగా పనిచేస్తూ మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్ కు పేరు ఉందన్నారు.
ప్రజల్లోకాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజం ఎత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో(Parliament elections) ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,టి పి సి సి డెలిగేట్ చింతకుంట్ల.లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ డిసిసిబి అధ్యక్షులు ముత్తవరపు. పాండురంగారావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి. రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, కౌన్సిలర్ గంధం.యాదగిరి,శివయ్య, ధావల్ తదితరులు పాల్గొన్నారు.
allegations against Uttam Kumar Reddy