సమాజసేవే ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ లక్ష్యం
మాజ సేవే ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ లక్ష్యమని ఆ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యమూర్తి అరుణ్ అన్నారు.
ఐవివో ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో సింగారం రోడ్డుకు మరమ్మతులు చేయించడం అభినందనీయం
విద్యార్థుల్లో దేశభక్తిని సమాజ సేవను పెంపొందించేందుకు కార్యాచరణ. సత్యమూర్తి అరుణ్
ప్రజా దీవెన, కోదాడ: సమాజ సేవే(Social service) ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(Indian Veteran Organisation) లక్ష్యమని ఆ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యమూర్తి అరుణ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని లాన్స్ నాయక్ గోపయ్య చారి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత తరం విద్యార్థుల్లో దేశభక్తి కరువైందని ఐ వి ఓ పక్షాన కళాశాల విద్యార్థుల్లో సామాజిక సేవ దేశభక్తి పెంపొందించడానికి కార్యచరణ రూపొందించామన్నారు. కోదాడ నుండి సింగారం వెళ్లే రోడ్డు గత కొన్నేళ్లుగా మరమ్మతులకు గురై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఐ వి ఓ స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు విశ్రాంత సైనిక అధికారి గుండా మధుసూదన్ చౌదరి సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించడం అభినందనీయం అన్నారు.
సైన్యంలో పనిచేసే ఉద్యోగ విరమణ చేసిన సైనికులచే ఏర్పడిన తమ స్వచ్చంద సంస్థ సమాజ సేవ పై ఆసక్తి ఉన్న యువతను భాగస్వాములు చేసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్,జిల్లా అధ్యక్షులు గుండా. మధుసూదన్ చౌదరి మాట్లాడుతూ 2022లో ప్రారంభమైన సింగారం రోడ్డు పనులు నేటి వరకు పూర్తి కాలేదు అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించేందుకు అధికారులకు పలుమార్లు విన్నవించిన పనులు పూర్తి చేయలేదన్నారు. రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తన వివాహ వార్షిక వేడుక సందర్భంగా తన సతీమణి ఐ వి వో ఉమెన్స్ వైస్ ప్రెసిడెంట్(IVO Women’s Vice President) లక్ష్మి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరగా 48 గంటల్లో రెండు లక్షల పైగా సొంత డబ్బులతో రోడ్డుకు మరమ్మతులు చేయించానని సమాజసేవ తమ కర్తవ్యం అన్నారు.
రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత లేవని రోడ్డు పక్కన మిషన్ భగీరథ(Mission Bhagirath pipe leakage) పైపు లీకేజీ కారణంగా రోడ్డుపై నీళ్ళు నిలుస్తున్నాయని ఆ శాఖ అధికారులు నిర్వహణ బడ్జెట్ తో ఎందుకు పనులు పూర్తి చేయించడం లేదని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన ఎంబి బుక్ సంబంధిత అధికారులు వెల్లడించాలన్నారు. పత్రికల ద్వారా రోడ్డు సమస్యను ఐ వి ఓ పక్షాన వెలుగులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం గోపయ్య చారి విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు ఈ సమావేశంలో యూత్ వింగ్ ప్రెసిడెంట్ పి. సత్యబాబు, పాటరన్ జగనీ ప్రసాద్, గుండపునేని. నాగేశ్వరరావు, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు, పిఆర్వో రమేష్, ఉమెన్ సేవింగ్ వైస్ ప్రెసిడెంట్ గుండా. లక్ష్మి సభ్యులు కుమారి తదితరులు పాల్గొన్నారు.
Community service is mission of Indian Veteran Organisation