Komati reddy birth day: ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు
రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను జిల్లా కేంద్రం లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ప్రజా దీవెన నల్గొండ: రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy)పుట్టినరోజు వేడుకలను జిల్లా కేంద్రం లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మంత్రి పుట్టినరోజు(Birthday) సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో(Gummula Mohan Reddy)పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు.
Komati reddy venkat reddy birthday