Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kerala court announcement జర్నలిస్టుల ఫోన్‌ సీజ్‌ సహేతుకం కాదు 

కేరళ కోర్టు సుష్పష్టం

జర్నలిస్టుల ఫోన్‌ సీజ్‌ సహేతుకం కాదు 

కేరళ కోర్టు సుష్పష్టం

ప్రజా దీవెన/కేరళ: జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో ‘నాలుగో స్తంభం’లో అంతర్భాగమని,  అవసరం మేర ఏ కేసులో నైనా జర్నలిస్ట్ ల ఫోన్‌ అవసరమని భావించిన యెడల సీఆర్‌పీసీ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు సీజ్‌ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్‌ను సీజ్‌ చేయడానికి వీల్లేదని అభిప్రాయపడింది.
కేసు పూర్వపరాలు ఇలా…
కేరళకు చెందిన షాజన్‌ స్కారియా అనే వ్యక్తి ఓ యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. అయితే, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పీవీ శ్రీనిజిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. స్కారియాతో జి.విశాఖన్‌ అనే ఓ మలయాళ జర్నలిస్టుకు వార్తల విషయంలో కొద్దిపాటి పరిచయం ఉంది.ఈ క్రమంలోనే షాజన్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ విచారణలో భాగంగా పోలీసులు వేధిస్తున్నారని విశాఖన్‌ ఆరోపించారు. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు (జులై 3న) జరిపారని, భయభ్రాంతులకు గురిచేస్తూ తన ఫోన్‌ను సీజ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను వేధించొద్దంటూ పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సోదాలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసుల తీరును తప్పుపట్టిన కోర్టు..

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పీవీ కున్హి కృష్ణన్‌ ఈ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు. సదరు జర్నలిస్టు నేరంలో భాగస్వామ్యం కాదని, అలాంటప్పుడు ఫోన్‌ సీజ్‌ చేయడం జర్నలిస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని మౌఖికంగా అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడి ఫోన్‌ అవసరమని భావిస్తే చట్టం లోని నిబంధనలు పాటించాలన్నారు. ఫోన్‌ను సీజ్‌ చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.

*నల్లగొండ లో ఓ కేసులో ఫోన్లు మిస్సింగ్….*
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక పరిశోధన పాత్రికేయుడి అరెస్ట్ సందర్భంగా పది ఫోన్లు, ఒక ల్యాబ్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆ మేరకు పంచనామా కూడా న్యాయస్థానంలో దాఖలాలు చేశారు. అయితే త
తాజాగా కేసు కథ ముగిసింది. సీజ్ చేసిన ఫోన్లనో నాలుగు ఫోన్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హైకోర్టులో కేసు ఉండటం గమనార్హం. ఈ విషయంలో పోలీసులపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు, హైకోర్టు న్యాయవాది యల్లంకి పుల్లారావు చెప్పారు.