MLC Elections: కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల (MLC Elections)ఎన్నికలలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిం చాలని కోరుతూ కాంగ్రెస్(Congress leaders) నాయకులు విస్తృత స్థాయి లో ప్రచారం నిర్వహించారు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల (MLC Elections)ఎన్నికలలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిం చాలని కోరుతూ కాంగ్రెస్(Congress leaders) నాయకులు విస్తృత స్థాయి లో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం PRTU యూనియన్ నాయకులతో పాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో గౌతమి జూనియర్ కాలేజీ, ప్రగతి జూని యర్ కాలేజీ లలో వేర్వేరు సమావేశాల్లో ఓట్లు(Vote) అభ్యర్థించారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, కౌన్సిలర్ గోగుల గణేష్, తదిత రులు పాల్గొన్నారు.
Congress leaders campaigning in MLC Elections