Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Working President KTR: విద్యావంతులూ విచక్షణతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయoడి

కాంగ్రెస్ పుకతో అలవర్చుకున్న మాయ మాటలు మోసాలకు ఆకర్షితు లమైతే మోసపోతాం, గోసపడుతాం అని ముందే చెప్పామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అవి కల్లారా చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్ మండి పడ్డారు.

అబద్ధాలకోరు కాంగ్రెస్ కు ఓటు వేయ‌వ‌యడం వృథా
అరచేతిలోవైకుంఠం తో మోసాలు చేయ‌డ‌మే కాంగ్రెస్ నేత‌ల నైజం
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజా దీవెన, నకిరేకల్: కాంగ్రెస్ అలవర్చుకున్న మాయ మాటలు మోసాలకు ఆకర్షితు లమైతే మోసపోతాం, గోసపడుతాం అని ముందే చెప్పామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అవి కల్లారా చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్(BRS Working President KTR) మండి పడ్డారు. కాంగ్రెస్ పరిపాలన దగ్గర్నుంచి గమనిస్తున్న గ్రాడ్యు యేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) విచక్ష ణతో ఓటెయ్యాలని అభ్యర్థించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Election) భాగం గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మ‌ద్ద‌తుగా శుక్రవారం జ‌రిగిన నకిరేకల్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశార‌ని, ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిండని విమర్శించారు. అప్పు డేమో అన్ని వ‌డ్ల‌కు, ఇప్పుడేమో స‌న్నాల‌కు, ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తుండు, మహిళలకు రూ.2,500 ఇస్తా అని మోసం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహు ల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. సన్న వడ్ల కు మాత్రమే బోనస్ అంటూ అన్ని బోగస్(Bogus) మాటలు మాట్లాడుతు న్నాడని సీఎంపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో అభూతకల్పన లు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్‌కు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు.

అలాగే విద్యుత్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్(congress candidate) అభ్య‌ ర్ధి ప‌చ్చి బ్లాక్ మెయిల‌ర్ దేవుళ్ల మీ ద ఒట్లు వేస్తూ రేవంత్ రెడ్డి(RevanthReddy) పూటకో అబద్ధం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వ కుండా ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్ధాలు అడుతున్నాడు. 30వేల ఉద్యోగాలు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ సీఎం అబద్ధాలు అడుతున్నాడని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్‌.

అతను అబ ద్ధాలు ఆడే వ్యక్తి అని 56 క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అమ్మాయిలు పెట్టిన కేసులే పది దాకా ఉన్నాయని, అతన్ని చట్ట సభల్లోకి రానివ్వకుండా బుద్ధి చెప్పా లన్నారు. జీవో 46ని రద్దు చేసేందుకు త‌మ‌ ప్రభుత్వంలో అన్నీ సిద్ధం చేసినం. దురదృష్టవశాత్తు అప్ప టికే ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రాసెస్ అంతా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డి గొప్ప విద్యావంతుడు అతనికి ఓటేస్తే ప్రభుత్వంపై కొట్లాడుతాడని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆ ర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 

Educated people vote in MLC elections with discretion