Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tummala Nageswara Rao:పట్టభద్రులంతా మల్లన్నకు పట్టంకట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలలో అభి వృద్ధి చేసే దిశగా పాలన సాగి స్తుందని, ఇచ్చిన హామీలన్నిం టినీ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలి
రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభి వృద్ధి చేసే దిశగా పాలన
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలలో అభి వృద్ధి చేసే దిశగా పాలన సాగి స్తుందని, ఇచ్చిన హామీలన్నిం టినీ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao)అన్నారు. తీన్మార్ మల్లన్నను(Tinmar Mallanna)గెలి పించాలని కోరుతూ శనివారం నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన నల్గొండ నియోజకవర్గస్థాయి పట్టభద్రుల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిందని ద్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల(Election) ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఓటర్లంతా తీన్మార్ మల్లన్నకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నపై ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందుల గురిచేసిందని అన్నారు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న కెసిఆర్ ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టాడని అన్నారు.

ప్రశ్నించే తత్వం ఉన్న తీన్మార్ మల్లన్న గెలిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగు తుందని అన్నారు.రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షు డు కొత్తకాపు శివసే నారెడ్డి(Shivsenareddy)మాట్లాడుతూ తీన్మార్ మల్ల న్న పోటీలో ఉంటే బిఆర్ఎస్ నాయ కులు జంకుతు న్నారని అన్నారు. ఆయన ఓటమికి అనేక కుట్రలు పన్నుతూ దుష్ప్ర చారాలు చేస్తున్నారని విమర్శిం చారు. నల్లగొండ(Nalgonda) అంటేనే కాంగ్రెస్ అడ్డ అని, ఇక్కడ మల్లన్నకు అత్యధిక మెజార్టీ రావాలని కోరారు. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి చట్టసభలలో ఉంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు.

పట్టభద్రుల ఎమ్మె ల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లా డుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్య ర్థిగా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయిస్తానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తాను గెలిచి న మళ్ళీ రాజీనామా చేస్తానని అన్నారు. కెసిఆర్ నియంత పాలన పై పోరాటం చేసినందుకు తనపై ఎన్నో అక్రమ కేసులు బనాయించిన ఒకటి కూడా నిరూపించలేకపోయిందని అన్నా రు. అక్రమ కేసులతో జైల్లో పెట్టి తనను,తన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన భయపడకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేశానని అన్నారు.

గత ప్రభుత్వం తనను చంపడానికి సూపారి కూడా ఇచ్చిందని, అయిన ప్పటికీ తాను దేనికి భయ పడలే దని అన్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టి నిరుద్యోగుల కోసం పోరాటం చేశానే తప్ప ఇంతవరకు ఎవరిని ఇబ్బందు లకు గురిచేసిన దాఖలా లు లేవని స్పష్టం చేశా రు.బ్లాక్ మెయిలర్ అంటూ తనపై అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తన ను ఓడించడానికి అనేక కుట్ర లు,కుతంత్రాలు పన్నుతు న్నారని, గ్రాడ్యుయేట్ ఓట్లను కూడా కొన డానికి ప్రయత్నిస్తున్నారని ఆరో పించారు. నిరుద్యో గులు, గ్రాడ్యు యేట్ ఓటర్లంతా ఆలోచించి ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్లతో తనను గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు.

తనను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన జాబ్ క్యాలెండర్, పాత పెన్షన్ విధానం అమలు అయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 46 , 317 తో నష్ట పోతున్న నిరుద్యోగులు, ఉద్యో గులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని స్పష్టం చేశారు.ఈ ఎన్నికలలో నన్ను ఓడించడాని ఇతర పార్టీల అభ్యర్థులు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తు న్నారని ఆరోపించారు.తాను ఓట్లు(Votes) కొననని సేవ చేయ డానికి మాత్రమే పోటీచేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్ని కలలో బోగస్ ఓట్లు, వందల కోట్లు ఖర్చు చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి కొన్ని ఓట్ల తేడాతో మాత్రమే తనపై గెలుపొందాడని అన్నారు. ఆయన గెలిచిన తర్వాత నిరుద్యోగులకు చేసింది ఏమీ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ శ్రేణు లంతా గ్రాడ్యు యేట్(Graduate) ఓటర్ల వద్దకు వెళ్లి తన గెలు పుకు కృషి చేయా లని కోరారు. డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు రఘువీర్ రెడ్డిని చట్టసభలలోకి పంపిస్తే నిరుద్యో గుల పక్షాన ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడని అన్నారు. గ్రాడ్యుయేట్ఓటర్లంతా మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా సరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, సిపిఎం నాయకులు ఎండి సలీం, సయ్యద్ హాషం, మైనార్టీ నాయకులు బషీర్, ఎంఏ ఖాన్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, పలువురు కౌన్సిలర్లు ,మాజీ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు పాల్గొన్నారు.

Graduates votes to Tinmar Mallanna