Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brs ex minister ktr fires Congress : బిఆర్ఎస్ అంటే స్కీమ్‌లు కాంగ్రెస్ అంటే స్కామ్‌లు

--గల్లీమే లూటో ఢిల్లీలో భాటో అన్న దే కాంగ్రెస్ పార్టీ నీతి --కాంగ్రెస్ అంటేనే దేశంలో కుంభ కోణాల కుంభమేళ --రాష్ట్రంలో రాజ్యమేలుతున్న బి ట్యాక్స్, యూ ట్యాక్స్‌, ఆర్ఆర్ ట్యాక్స్ లు --సన్న బియ్యం కొనుగోలులో రూ.3 00 కోట్లు అవినీతికి తెరలేపారు --నిబంధనల్లో మినహాయింపు ఇచ్చి మా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి సంస్థకు టెండర్ లు ఇచ్చారు --తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బిఆర్ఎస్ అంటే స్కీమ్‌లు

కాంగ్రెస్ అంటే స్కామ్‌లు

–గల్లీమే లూటో ఢిల్లీలో భాటో అన్న దే కాంగ్రెస్ పార్టీ నీతి
–కాంగ్రెస్ అంటేనే దేశంలో కుంభ కోణాల కుంభమేళ
–రాష్ట్రంలో రాజ్యమేలుతున్న బి ట్యాక్స్, యూ ట్యాక్స్‌, ఆర్ఆర్ ట్యాక్స్ లు
–సన్న బియ్యం కొనుగోలులో రూ.3 00 కోట్లు అవినీతికి తెరలేపారు
–నిబంధనల్లో మినహాయింపు ఇచ్చి మా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి సంస్థకు టెండర్ లు ఇచ్చారు
–తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: రైతన్న ల నుంచి సేక రించిన ధాన్యం పై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కార్ తెరతీసిందని ఆరోపించా రు. సన్న బియ్యం కొనుగోలులో రూ. వెయ్యి కోట్ల కుంభకోణం జరి గిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఈ కుంభకోణంలో ముఖ్య మంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్‌లు కాంగ్రెస్ అంటే స్కామ్‌ల ని ఆయన అభివర్ణించారు. రేవంత్ రెడ్డి సర్కా ర్‌పై బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( ktr) నిప్పులు చెరిగారు.

ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ గల్లీ మే లూటో ఢిల్లీలో భాటో అన్న దే కాంగ్రెస్ పార్టీ నీతి అని ఈ సందర్బంగా ఆయ న పేర్కొన్నారు. కాం గ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళ అని ధ్వ జమెత్తారు. రాష్ట్రంలో ఇప్పటికే బి ట్యాక్స్, యూ ట్యాక్స్‌తో పాటు ఆర్ఆర్ ట్యాక్స్ రాజ్యమేలుతుందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ జేబు నింపుకోనే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ( congress ) పార్టీ నేతలపై కేటీఆర్ మండి పడ్డారు. 35 లక్షల ధాన్యం విక్రయం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో మొదటిగా స్కాంకు అలాగే 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు ప్రక్రియ ద్వారా రెండో స్కామ్‌కు ఈ ప్రభు త్వం తెరతీసిందన్నా రు.

మొత్తం రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిం దని కేటీఆర్ గుర్తు చేశారు. 2100 క్వింటాలు చొప్పున ధాన్యం కొంటా మని మిల్లర్లు ( millar s) అంటున్నా వారికి ఇవ్వకుండా గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు స్కెచ్ వేశారన్నా రు. ఇక ఈ గ్లోబల్ టెండర్లను కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందు స్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కిం చుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థల్లో కేంద్రీయ బండార్‌ ను గతంలో తమ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పట్టిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అదీకాక సదరు సంస్థ కు నిబంధనల్లో మిన హాయింపు ఇచ్చి మరీ బ్లాక్ లిస్టు కంపెనీని టెండర్లలో పాల్గొనేలా చేసిందని విమర్శించారు.

ఈ నాలుగు సంస్థలు కేవలం ధాన్యం మాత్రమే సేకరించుకుని వెళ్లా లి కానీ మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకొని మనీ లాండరింగ్‌కు పాల్ప డుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇక గత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థకు ఎందుకు అనుమతి ఇచ్చిందో ఈ రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) సర్కా ర్ చెప్పా లని డిమాండ్ చేశారు. అందు లో రూ. వందల కోట్లు మీకు ముట్టిన విషయంపై కూడా రాష్ట్ర ప్రజల కు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించాల్సి న 2.20 లక్షల సన్న బియ్యం కొనుగోలులో రూ.300 కోట్లు అవినీతికి తెర లేపిందన్నారు. రాష్ట్రంలోరూ.3 5 రూపాయలకు కొత్త సన్నబియ్యం అందుబాటులో ఉంటే ఈ ప్రభు త్వం రూ.57 రూపాయలకు కిలో చొప్పున కొంటుం దని చెప్పారు. ఇక సన్న బియ్యం కొనుగోలుకు కూడా గ్లోబల్ టెండర్ ( globel tenders) అనే కుట్రకు లేపిందన్నారు. ధాన్యం సేకరణ లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన అవే నాలుగు కంపెనీ లకు బియ్యం కొనుగోలును సైతం అవే సంస్థలకు కట్ట బెట్టిందని పేర్కొన్నారు.

నాలుగు సంస్థలు దాదాపు ఒకే ధరకు టెండర్ వేశాయంటే ఇది రింగు కాక మరేమిటని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ఈ రెండింటిలో మొ త్తం రూ.1,100 కోట్ల కుంభ కోణం జరిగిందన్నారు. ఈ మొత్తం వ్యవ హారంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభు త్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుమతి లేకుండా ఏమీ జరగ దనే విషయం అందరికీ తెలు సునని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ మొత్తం స్కామ్‌లో బిజెపి ( bjp) పాత్ర కూడా ఉందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర అమలు, బియ్యం సేకరణ తదితర అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో జరుగు తాయన్నారు. అయితే ఈ అంశంలో అవినీతి జరిగిందంటూ బిజెపి శాసనసభా పక్ష నేత స్వయంగా చెబుతున్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్ప టి దాకా స్పందించ లేదన్నారు. దీనిని ఏమనుకోవా లని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరి గిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పం దించ లేదని ప్రశ్నించారు. ఈ రెండు టెండర్ల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని కేటీ ఆర్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం రేవం త్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( minister Uttam Ku mar Reddy) సమాధానం చెప్పాలన్నారు.

ఇక వ్యవహారంలో కేంద్రం, ఎఫ్‌సీఐ, రేవంత్ సర్కార్ స్పందించకుం టే ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టమన్నారు. న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఈ కుంభకో ణాలకు సంబంధించిన ఆధారాలతో వీళ్ళందరిని ప్రజా కోర్టులో ఎం డగడతామమని కేటీఆర్ స్పష్టం చేశారు.