grain scam: కుంభకోణం ముమ్మాటికీ నిజం
రాష్ర్ట పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండరుప్రక్రియలో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పునరు ద్ఘాటించారు.
ధాన్యం టెండర్లపై బహిరంగ చర్చ కు సిద్ధమేనా
డీఫాల్ట్ మిల్లర్ల జాబితా ఎందుకు బయటపెట్టరెందుకు
ఏప్రిల్ మాసంలో సెటిల్మెంట్ మీటింగ్ వాస్తవం కాదా
ఉత్తమ్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ర్ట పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండరుప్రక్రియలో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy)పునరు ద్ఘాటించారు.టెండరు నిబంధనల ప్రకారం మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35 లక్షల టన్నుల ధాన్యాన్ని కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు తరలించా లి, ఇందుకోసం క్వింటాల్ కు రూ.2,007 చొప్పున ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి, కానీ తమకు ధాన్యం బదులు క్వింటాల్ కు రూ.2,223 చొప్పున నగదు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లు మిల్లర్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కేసు లు పెడతామంటూ బెదిరిస్తున్న అధికారులు వంద రూపాయల స్టాంప్ పేపర్లపై మిల్లర్లతో అగ్రిమెం ట్లు రాయిస్తున్నారన్నారు.
కాంట్రాక్ట ర్లు ధాన్యాన్ని తరలించకుండానే క్వింటాలుకు అదనంగా రూ.216 చొప్పున వసూలు చేస్తున్నారని, ఇది మొత్తంగా రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది జరగట్లేదని చెప్పండి నేను బహి రంగ చర్చకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ కు(Uttam)సవాల్ విసిరారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన సదరు స్టాంపు పేపరు కాపీని మీడియాకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో జరుగు తున్న అవినీతి, అక్రమాలపై సీఎం రేవంత్కు(CM Revanth)తాను 19 ప్రశ్నలు సంధి స్తే, బహుశా ఆయన ఒత్తిడితో మంత్రి ఉత్తమ్ ఒక్క ప్రశ్నకైనా స్పందించారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన మిల్లర్ల నుంచి వసూళ్ల కు పాల్పడడం ఎంతవరకు సబబని, ఇందుకు సంబంధించి గత ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్లతో సెటిల్మెంట్ మీటింగ్ నిర్వహించడం వాస్తవం కాదా అని నిలదీశారు.
ఆనాడు మీరు టీపీసీసీ(TPCC) పదవి ఎలా తెచ్చుకున్నారో పదేళ్లు మీతో సహ వాసం చేసిన నాకు తెలియదా, మీలాగా మాట్లాడాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ నాది అలాంటి దిగజారుడు వ్యక్తిత్వం నాది కాదని, మీలాగా అపాయిం టెడ్ నేతను కాదని, సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని తాను ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు, తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ ఇక్కడ లేరని గుర్తుంచుకోండని హితవు పలికారు. గతంలో ఆర్ టాక్స్, ఆర్ఆర్ టాక్సు, బీటాక్సు గురించి నేను మాట్లాడితే స్పం దించని మీరు, ఇప్పుడు ఇంత సీరియస్ గా స్పందిస్తున్నారంటే భారీ కుంభకోణమే జరిగినట్లు తేటతెల్లమవుతోందని వ్యాఖ్యా నించారు. సూర్యాపేటలో(Suryapeta) రూ.90 కోట్లు బకాయి ఉన్న మిల్లర్ను అరెస్టు చేసిన అధికారులు వందల కోట్లు బకాయి ఉన్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డీఫాల్ట్ మిల్లర్ల జాబితాను ఎందుకు బయటపె ట్టడం లేదని నిలదీశారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
Uttam kumar reddy scam in grain