Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

No stock of seeds: ప్రజా పాలన ఇదేనా..!

రాష్ట్రం లో ప్ర‌తి చోట కూడా నో సీడ్స్ బో ర్డులు దర్శనమిస్తున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ వ్యక్తం చేశారు.

విత్త‌నాల కోసం రైతుల వెత‌లపై పట్టని ప్రభుత్వం
10గంట‌లు లైన్ లో ఉన్నా అంద‌ ని సీడ్స్
ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ స‌ర్కార్ పై మండిప‌డ్డ కేటీఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ప్ర‌తి చోట కూడా నో సీడ్స్(Seeds) బో ర్డులు దర్శనమిస్తున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విచారణ వ్యక్తం చేశారు.క‌నీసం ఎన్ని విత్త‌నాలు కావాలో కూడా తెలియ‌ని ప్ర‌భుత్వం రాష్ట్రం లో కొలువుదీరి ఉందని ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా కేటిఆర్ రేవంత్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.ముఖ్య‌మంత్రి ఢిల్లీలో, వ్య‌వ‌సాయ మంత్రి గ‌ల్లీలో, రైతులేమో రోడ్డ‌పైన మొన్న సాగునీ రందించ‌క పంట‌లు ఎండ‌బెట్టారు,నిన్న ధాన్యం కొనుగోళ్లు జ‌ర‌ప‌క అన్న‌దాత‌ల్లో క‌న్నీళ్లే నింపారు,ఇప్పుడేమో విత్త‌నాలు అడిగితే లాఠీల‌తో కొడుతున్నారు, ఇదేనా ప్ర‌జా పాల‌న అంటూ క‌డిగి పారేసిన కేటీఆర్ తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు.

విత్తనాల కోసం రైతులు(Farmers) ఇబ్బందు లు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా, లేనట్టా, విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ఎన్నికల(Election) ప్రచారంలో తిర గడం తప్ప. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు, పాలన పూర్తిగా పడకేసిందని చెప్ప డానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి సాగునీళ్లు ఇవ్వడం చేత కాక పంటలు ఎండగొట్టారు.

ఇప్పు డు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా గత పదేళ్ల పాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు 10 గంటలపాటు పడి గాపులు పడినా అందిం చలేరా రంగారెడ్డి(Ranga Reddy) నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటీ కష్టాలు ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పిం చండి బ్లాక్ మార్కెట్ కు తర లించకుండా కళ్లెం వేయండి కాంగ్రెస్(Congress) వచ్చింది.. కాటగలిసినం అంటు న్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి, లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు. జై కిసాన్.. జై తెలంగాణ’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ktr tweet on no stock of seeds