Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bapatla: విహారయాత్రలో విషాదం

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల, గుంటూరు రోడ్ లోని నాగరాజు కాల్వలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లం తయ్యారు.

బాప‌ట్ల జిల్లా నాగ‌రాజు కాల్వ‌లో ఘ‌ట‌న
సూర్యలంక విహార యాత్ర‌కు వ‌చ్చిన‌ కూక‌ట్ ప‌ల్లి వాసులు
ప‌దేళ్ల బాలుడితో స‌హా కొట్టుకు పోయిన న‌లుగురు

ప్రజా దీవెన, గుంటూరు: బాపట్ల(Bapatla) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల, గుంటూరు(Guntur) రోడ్ లోని నాగరాజు కాల్వలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లం తయ్యారు. అయితే, గల్లంతైన యువకులు హైదరాబాద్ నగరం లోని కూకట్ పల్లికి(Kukat Palli) చెందిన వాసు లుగా గుర్తించారు. బాపట్లలోని సూర్యలంక(Surya Lanka) తీరానికి విహార యాత్రకు వచ్చి సమీపంలోని కాలువలో ఈతకు దిగి యువకులు కొట్టుకుపోయారు. విషయం తెలు సుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా గల్లంతైన వారు సన్నీ, సునీల్, కిరణ్, నందు అని గుర్తించారు. మొత్తం నలుగురు గల్లంతు కాగా, అందులో 10సంవ త్సరాల బాలుడితో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. నలుగు రు మృతదేహాల కోసం గజ ఈత గాళ్లతో(Yard swimming) వెతికిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసు కుని విచారణ చేస్తున్నారు.

four youth missing in Nagaraju canal bapatla