Electricity bill collectors: ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్టర్లకు కనీస వేతనాలు
విద్యుత్ శాఖ రెవెన్యూ విభాగంలో కమిషన్ పద్ధతిలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు కనీస వేతనాలు నిర్ణ యించి అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యు నైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూని యన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: విద్యుత్ శాఖ(Electricity Department)రెవెన్యూ విభాగంలో కమిషన్ పద్ధతిలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు కనీస వేతనాలు నిర్ణ యించి అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యు నైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూని యన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి(Thummala Veera Reddy) రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ ఎలక్ట్రిసిటీ సూపరిండెంట్ ఇంజనీర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి(Veera Reddy) మాట్లాడుతూ గతంలో ఒక పిఆర్ కు రూరల్ ప్రాంతంలో 2-75 పైసల, టౌన్లలో రెండు రూపాయల చొప్పున కమిషన్ పద్ధతిలో ఇచ్చేవారు. దీనితో పట్టణ ప్రాంతాల్లో సుమారు నెలకు 12000, గ్రామీణ ప్రాంతాల్లో ఆరువేల రూపాయలు వచ్చేది.
దీనితో గత 25 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా 650 మంది బిల్ కలెక్టర్లు జీవనోపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఆరు గ్యారెంటీలలో భాగంగా గృహవసరాల విద్యుత్ చార్జీలు జీరో బిల్లు రావడంతో బిల్ కలెక్టర్లకి కలెక్షన్ లేక కమిషన్ రావడంలేదని కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు పిఎఫ్(PF) ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ టియు(CITU) జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు తిరుమల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత రెడ్డి, ఎస్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Minimum wages Electricity bill collectors