Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jabardasth actors:స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ తృతీయ వార్షికోత్సవం లో జబర్దస్త్ నటులు సందడి

కోదాడ పట్టణంలో స్థాపించిన స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మాతంగి శైలజ ఆధ్వర్యంలో స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వార్షికోత్సవాన్ని బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణంలో స్థాపించిన స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మాతంగి శైలజ ఆధ్వర్యంలో స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్(Snehitha womens organisation)  వార్షికోత్సవాన్ని బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటులు వినోదిని, అప్పారావు లు(Apparao)  సందడి చేశారు. కళాకారులు అభిమానుల కోసం హాస్య సన్నీ వేషాలు,ఆట పాటల ప్రదర్శించారు. వారు ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నవి అలాగే ప్రముఖ గేయ రచయిత దరువు అంజన్న(Daruvu Anjanna) పాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలు ఊగించారు ఈ సందర్భంగా స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మాతంగి శైలజా(Matangi Shailaja) మాట్లాడుతూ స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ మహిళా సాధికారత కోసం ,మహిళలు అన్ని రంగాల్లో రాణించడం కోసం కృషి చేస్తుందన్నారు.

మహిళలు పలు రంగాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపు గా తమ సంస్థ అవార్డులు(Awards) అందజేసి ప్రోత్సహిస్తుందన్నారు.అనంతరం పలు రంగాల్లో రాణించిన మహిళలకు అవార్డులు అందజేసి జబర్దస్త్ నటులను ఘనంగా సత్కరించారుఈ కార్యక్రమంలో సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ తార స్రవంతి,(Dr. Tara Sravanti,)న్యాయవాది సిలి వేరు వెంకటేశ్వర్లు,స్ధానిక మహిళా నాయకురాలు నూనె సులోచన , నృత్య కళాకారుల పాల్గొన్నారు.

snehitha womens organisation anniversary