Cotton seeds: సమృద్ధిగా పత్తి విత్తనాలు
రాష్ట్రం లో పత్తి విత్తనాల కొరతలేదని, పత్తిసాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
విత్తనాలపై విపక్షాలవి అసత్య ఆరోపణలు
ఈ దఫా 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకెట్లకు గాను ఇప్పటికే అందుబా టులో 51 లక్షల ప్యాకెట్లు
దాదాపు10 లక్షల విత్తన ప్యాకెట్ల ను కొనుగోలు చేసిన రైతులు
గందరగోళం సృష్టిస్తే ఎట్టి పరిస్థితు ల్లో ఉపేక్షించబోము
వ్యవసాయ శాఖా మంత్రి తు మ్మల నాగేశ్వర రావు
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో పత్తి విత్తనాల(Cotton seeds) కొరతలేదని, పత్తిసాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. విత్తన కంపెనీలతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 2023- 24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తిపంట సాగుకాగా ఈ వానాకాలానికి సాగుకు సరిపడా పత్తి విత్తనాలు 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచ నావేసి 1.24కోట్ల పత్తి విత్తన ప్యాకె ట్లను రైతులకు అందుబాటులో ఉoచడానికి ప్రణాళిక వేశామని, ఇప్పటిదాకా 51,40,405 పత్తి ప్యాకెట్లు వివిధ జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పా రు. 10,39,040 ప్యాకెట్లను విత్తనా లు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
పత్తి విత్తనాల కొరత ఉన్నట్లు కొందరు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అది అవాస్తవమని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఒకే కంపెనీకి చెంది న ఒకే వెరైటీ విత్తనాలు అడగటం తో రైతులను ‘క్యూ’ లో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్ల చొ ప్పున పంపిణీచేశారని, అంతేతప్ప మార్కెట్లో గానీ, జిల్లాల్లోగానీ విత్త నాల కొరతలేదని తెలిపారు. రైతు లు ఒకే కంపెనీ విత్తనాలకోసం పోటీ పడకుండా వ్యవసాయ యూనివ ర్సిటీ శాస్త్రవేత్తలు(Agricultural University scientists)సూచించిన పలురకాల హైబ్రీడ్(Hybrid) విత్తనాలు తీసుకోవాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడు లొస్తాయని తుమ్మల తెలిపారు. నకిలీ విత్తన విక్రేతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 1966 విత్తన చట్టం ప్రకారం చర్య లు తీసుకుంటామని హెచ్చరిం చారు.
ఇప్పటికే రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నిరుడు వానాకాలంలో రూ.66.81 కోట్ల సబ్సిడీతో 1.27 లక్షల క్వింటా ళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేశారని, ఇప్పటి వరకు కేవలం 24,898 క్వింటాళ్లు మాత్రమే రైతులకు పంపిణీచేశారని, ఈ వానాకాలం సీజనకు రూ. 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపి ణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 79,261 క్వింటాళ్లు పంపిణీ చేశామ ని, అందులో 54,162 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేశారని, గతేడాదితో పోలిస్తే 29 వేల క్వింటాళ్లు ఎక్కువగా పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఎన్నికల(Election) నియమావళి అమల్లో ఉ న్నప్పటికీ ఈసీ నుంచి అనుమతు లు తీసుకొని టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో పంపిణీదారులకు చెల్లించకుండా ఉన్న బకాయిలను ఈ ప్రభుత్వం విడుదలచేసినట్లు తెలిపారు.విత్తనాల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సొసైటీల పరిధిలోని రైతులకు విత్తనాలపై వచ్చిన సమాచారంతో కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతుల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించే వారిని ఇకమీదట ఉపేక్షించేదిలేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఎరువుల కొరతకూడా రాష్ట్రంలో లేదని, అన్ని ఎరువులు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. నిరుడు వానాకాలం సీజన్ లో ఈ సమయానికి 4,24,160 టన్నుల యూరియా(Urea) ఉంటే.. ఈసారి 6,88,382 టన్నులు అందుబా టులో ఉంచినట్లు తెలిపారు.
డీఏపీ(DAP) అప్పుడు 1,19,888 లక్షల టన్ను లు, ఈఏడాది 79,376 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు నిరుడు 3,76, 897 లక్షల టన్నులు అందుబాటు లో ఉంచితే.. ఈ సీజన్లో 4,21,718 టన్నులు అందుబాటులో ఉంచిన ట్లు తెలిపారు. ఎంవోపీ నిరుడు 8,729 టన్నులు ఉంచితే, ఇప్పుడు 24,984 టన్నులు, ఎస్ఎసపీ నిరుడు 17,993 టన్నులు అందు బాటులో ఉoచితే ఇప్పుడు 13,99 7 టన్నులు, మొత్తం కలిపి నిరుడు 9,47,667 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచితే ఈ ఏడాది ప్రభుత్వం 12,28,457 టన్నులు అందుబాటులో ఉoచినట్లు తెలి పారు. విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచిన ఈ ప్రభుత్వానికి ప్రణాళికలేదని, ఎరువులు, విత్తనాలను తగినం తగా సరఫరా చేయటంలేదని విపక్ష నేతలు ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు.
కాగా అన్ని జిల్లాల్లో అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటు లో ఉన్నాయని, వాటిని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవా లని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ మేరకు ఏఏ జిల్లాలో ఏఏ విత్తనాలు ఎంత స్టాక్ ఉన్నాయో తెలియజేస్తూ కలెక్టర్ల కు బుధవారం లేఖ రాశారు. ఈ సీజన్ కోసం 1.41 లక్షల క్వింటా ళ్ల పచ్చిరొట్ట విత్తనాలను, 1.26 కోట్ల పత్తి విత్తనాలను అందుబాటు లో ఉoచినట్లు తెలిపారు. ఎక్కడ కూడా విత్తనాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
more cotton seeds available for farmers