Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amit shah: ఆంద్రప్రదేశ్ లో ఎన్డీఏదే అధికారం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు.

అత్యధిక ఎంపీ స్థానాలు సైతం గెలుస్తున్నాం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే(NDA) ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Home Minister Amit Shah)స్పష్టం చేశారు. అత్యధిక ఎంపీ స్థానాలను సైతంతమ కూట మి కైవసం చేసుకుంటుందని చెప్పా రు. పశ్చిమ, ఉత్తర భారతాల్లో బీజేపీ(BJP) తిరుగులేని శక్తి అని ఈసారి తూర్పు, దక్షిణ భారతాల్లో సైతం అధిక స్థానాల్లో గెలుస్తామని తెలిపారు. శనివారం లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌ జరుగ నున్న నేపథ్యంలో ఆయన బుధ వారం ఎన్డీటీవీ(NDTV)కి ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు. బెంగాల్‌, జార్ఖండ్‌, బిహార్‌, ఒడిసా కలిసిఉన్న తూర్పు జోన్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నా రు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాట క, తమిళనాడు, కేరళలతో కూడిన దక్షిణ భారతాన ఎక్కువ సీట్లు గెలు చుకున్న అతిపెద్ద పార్టీగా అవతరిం చబోతున్నామని జోష్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మా కూటమి అధికా రంలోకి రాబోతోందని, అక్కడ 25 ఎంపీ స్థానాల్లో అత్యధికం గెలుచు కుంటామని, తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు వస్తాయని ఆశిస్తు న్నామని, బెంగాల్లో 42 స్థానాలకు 24–30 మధ్య కాగా ఒడిసాలో 17 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని చెప్పారు. అక్కడ 147 అసెంబ్లీ స్థానాలకు 75 సాధిస్తామని వెల్లడించారు. ఈసారి 400కిపైనే అనేది వట్టి నినాదమా లేక వాస్తవాల ఆధారంగా వేసిన అంచ నాయా అని ప్రశ్నించగా మోదీ సారథ్యంలో 2014లో సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలన్న నినాదం ఇచ్చినప్పుడు ఇది సాధ్యం కాదని ఢిల్లీలోని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పారని కానీ బీజేపీ ఆధిక్యం సాధించిందని అమిత్‌షా గుర్తుచేశారు.

అదేవిధంగా 2019లో 300 ప్లస్‌ నినాదం ఇచ్చినప్పుడు కూడా వారు జరిగే పనికాదన్నారు. మేం సంపూర్ణ మెజారిటీ సాధిం చామని, ఈసారి 400పైనే సాధిస్తా మన్నా వారు కుదరదంటున్నారు. అయినా మేం సాధించబోతున్నాం. సదరు విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో అయినా మమ్మల్ని నమ్ముతారని భావిస్తున్నాను అని వ్యాఖ్యానిం చారు. ఢిల్లీ లిక్కర్‌(Delhi Liquor)

పాలసీ కుంభకో ణం సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) ఎప్పటికీ వెంటాడు తుందని షా అన్నారు. ప్రజలు ఆయన్ను చూసినప్పుడల్లా వారికి భారీ లిక్కర్‌ సీసా కనిపిస్తుంటుం దని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ జమ్మూకశ్మీరు పాలసీ విజయవం తమైందని షా తెలిపారు. ‘370 అధికరణను రద్దుచేసి మీరు భారత్‌లో భాగమని భారత్‌ మీదేనన్న సందేశాన్ని కశ్మీరీలకు పంపారు. 370 రద్దు ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడింది. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) భారీ పోలింగ్‌ నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా 90 శాతానికి పైగా ఓటింగ్‌ జరిగింది. వేర్పాటువాద సంస్థల సభ్యులు కూడా ఓట్లేస్తున్నారు. దీనిని ప్రతి భారతీయుడూ స్వాగతించాలని కోరారు.

NDA alliance win in andhra elections