Uttam kumar reddy: నిజాయితీకి నిలువుటద్దం ఉత్తమ్ –ఆయనపై ఆరోపణలన్నీ అవాస్త వాలే
ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడు మంత్రి ఉత్తంకు మార్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.
ముప్పైయేళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
ప్రజా దీవెన, హైదరాబాద్: ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడు మంత్రి ఉత్తంకు మార్ రెడ్డి(Uttamkumar Reddy) అని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్(Nuthi Srikanth Goud) పేర్కొన్నారు. అవాస్తవాలను వాస్త వంగా చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీపై బురదల్లేందుకు ప్రతిపక్షాలు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షే త్రంలో పప్పులు ఉడకక కాంగ్రెస్(Congress) పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తంకుమార్ రెడ్డి లాంటి ఉత్తమ వ్యక్తిపై ఉత్త ప్రకట నలు చేస్తూ తమ పబ్బం గడుపు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్(KTR) చిల్లర మాటలు ఆయన హోదా కు తగవని వ్యాఖ్యా నించారు. వ్యక్తి గత ప్రచారం కోస మే భారతీయ జనతా పార్టీ నాయ కులు మహేశ్వర్ రెడ్డి తమ ప్రభు త్వంపై పదేపదే ఆరో పణలు చేస్తు న్నాయని దుయ్యబట్టారు. బాధ్యత గల స్థానంలో ఉన్న ప్రతిపక్షాలు అబ ద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భారత రాష్ట్ర సమితి హయాంలో సివిల్ సప్లై శాఖ రూ. 58 వేల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు.తమ ప్రభుత్వం తడిసిన ధాన్యం కొంటా మని ఆ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు. బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం మాట్లా డే సంస్కారం తమ ది కాదని శ్రీకాంత్ అన్నారు.
కేటీఆర్ మహేశ్వ ర్ రెడ్డి(Maheshwar Reddy) తెలిసి తెలియని సమాచా రంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని ప్రయత్నం చేస్తున్నా రని తమలాంటి నిజాయితీపరులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి అయింది కాదని మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం తమ దేనని అన్నారు . కెప్టెన్ ఉత్తంకు మార్ రెడ్డి 30 ఏళ్ల రాజకీయ జీవి తంలో ఏనాడు అవినీతికి పాల్పడ లేదని ఆరుసార్లు శాసనసభ్యులుగా ఒకసారి ఎంపీగా ప్రజల ఆశీర్వా దంతో ఎన్నికయ్యారని ఆయనపై చేసిన అవినీతి ఆరోపణలు భారతీ య జనతా పార్టీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెనకకు తీసుకోవా లని ఉత్తమ్ కుమార్ రెడ్డి కే క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెయ్యి కోట్లు పంపానని రూ. 100 కోట్లు అవినీతికి పాలు పడ్డారని ఆరోపణ చేయడంలో అర్థం లేదు అని అన్నారు.
భార తీయ జనతా పార్టీ(BJP) భారత రాష్ట్ర సమితి నాయకు లు కుమ్మక్కై ఉత్తంకుమార్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారని నీతిగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఉత్తం కుమార్ రెడ్డి అని ఎవరు ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి ఆయ నకు లేదు అని అన్నారు. రేవంత్ సారథ్యంలో పారదర్శక పాలన… సీఎం రేవంత్ రెడ్డి సార థ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శ క పాలన అందించేందుకు కృషి చేస్తుందని భారత రాష్ట్ర సమితి పాలనలో పౌరసరఫరాల శాఖను పూర్తిగా పట్టించుకోలేదని ఫలి తంగా కుంభకోణాల వేదికగా మారిందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 11వేల కోట్ల నష్టాలు తెచ్చిందని ఆరోపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 58 వేల కోట్లు రుణాలు తీసుకుందని వాటికి సంబంధించి 100 రోజుల్లోనే కొంత మొత్తం బకాయిలు చెల్లించామని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారని శ్రీకాంత్ అన్నారు. గత ఏడాదికి ఈ ఏడాదికి పోల్చు కుంటే భారత రాష్ట్ర సమితి ప్రభు త్వం కంటే ముందే ధాన్యం కొను గోలు చేశామని అంతేకాకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొను గోలు చేసిన రికార్డు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందన్నారు.
Uttam Kumar reddy is honesty person