Sheep distribution scheme: గొర్రెల పంపిణీ పథకం గోవిందా…గోవిందా
తెలం గాణలో గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసుపాలైంది. గొర్రెల పథకంలో అంతులేని అవి నీతి, అక్రమాలు చోటుచేసుకున్న పరిణామాలు సుపరిచితమే.
గొర్రెల పంపిణీ పథకంలో అంతు లేని అవినీతి, అక్రమాలు
ఎసిబి దర్యాప్తులో ఇప్పటివరకు సుమారు రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తింపు
గొర్రెల గోల్‌మాల్ కేసులో ఇప్పటికే 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన ఎసిబి
కాగితాలపైనే కొనుగోళ్లు, లబ్ధిదా రులకు టోకెన్లు, అధికారులకు ఒక్కో యూనిట్‌కు రూ. 20 వేలు
తాజాగా టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో రాంచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ అరెస్ట్
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో గత బిఆర్ ఎస్(BRS) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసుపాలైంది. గొర్రెల పథకంలో అంతులేని అవి నీతి, అక్రమాలు చోటుచేసుకున్న పరిణామాలు సుపరిచితమే. ఈ ప్రతిష్టాత్మక పథకం బిల్లుల చెల్లిం పుల్లో ఏకంగా రూ.700 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఎసిబి దర్యా ప్తులో బట్టబయలైంది. కొను గోలు చేయని గొర్రెలు కోనుగోలు చేసిన ట్లు, లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు కేవలం కాగితాల పైనే లావాదేవీలు నడిపించి పథకాన్ని గోవిందా గోవిందా(Govinda Govinda)నామస్మరణ ను పదేపదే మననం చేస్తూ అక్రమాల కు నిలయంగా మార్చేశారు. పథకం అమలు లో ముందుగా రూ.2.10 కోట్ల గోల్‌మాల్ జరిగి నట్లు గతం లోనే కేసు నమోదు కాగా ఏసీబీ దర్యాప్తులో ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు సుమారు రూ.70 0 కోట్ల అక్రమాలు జరిగినట్లు విచా రనాధికారులు తేల్చేశారు.
మరో వైపు ఈ పథకంలో బిల్లుల చెల్లింపు అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకోవడం గమ నార్హం. తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈవో సబావత్ రాంచం దర్ నాయక్‌ను, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav)వద్ద ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌కు మార్‌ను ఏసీబీ అధి కారులు శుక్రవారం అరెస్టు చేశారు. రాంచందర్ గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం దారుల సహకార సంస్థ(టీఎస్‌ఎస్ జీడీసీఎఫ్) ఎండీగా కూడా పనిచేశా రు. కాగా, రూ.2.10 కోట్ల గోల్‌మాల్ కేసులో ఏసీబీ ఇప్ప టికే 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేయగా అందు లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తాజా అరెస్టులతో గొర్రెల స్కాంలో అరెస్టయిన వారి సంఖ్య 12కు చేరింది. కల్యాణ్, రాంచందర్ తమ అధికారం, రాజకీయ అండ దండలను అడ్డుపెట్టుకొని గొర్రెల కొనుగోలు, నిధుల చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించినట్లు ఏసీబీ గుర్తించింది.
ఉద్దేశపూర్వకంగానే ఈ పథకంలో ప్రైవేటు వ్యక్తుల్ని భాగ స్వాము లను చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిధులు పక్కదారి పట్టించాలని జిల్లా స్థాయిలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ల తోపాటు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దర్యా ప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ వారు ఇచ్చిన సమాచా రం, దర్యాప్తులో సేకరించిన ఆధా రాల మేరకు కల్యాణ్, రాంచందర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ పథకంలో కొంద రు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లే అందకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. గొల్ల, కురుమలకు గొర్రెలు(Sheep)ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాసు కోవ డం అనవాయితీగా కొనసాగుతుం డగా నల్లగొండ జిల్లాలోని ఒక గ్రా మంలో లబ్ధిదారులకు ప్లాస్టిక్ కాయి న్లు పంపిణీ చేశారు. పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారుల తోపాటు దళారులు కలిసి కాయిన్లు అప్పగిం చారు.
గొర్రెలు తెచ్చినవారికి లబ్ధిదా రులు ఈ కాయిన్లు చూపిస్తే వాళ్లు గొర్రెలు ఇచ్చిపోతారు. కానీ, దళారు లు గొర్రెలు తెచ్చింది లేదు, లబ్ధిదా రులకు ఇచ్చిందిలేదు. కానీ, కాయి న్లు మాత్రం వారివద్దే ఉండిపోయా యి. కాగితాలపైనే గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యకలాపాలు నిర్వహిం చారు. ఈలోగా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై విచారణ జరి గింది. విచారణాధికారులు నల్లగొం డ (Nalgonda) జిల్లాకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచార ణ చేయగా లబ్ధిదారులు ప్లాస్టిక్ కాయిన్లు ముందలేశారు. వారి పేర్లను జాబితాలో చూస్తే లేకపోగా గొర్రెల యూనిట్లు అందినట్లే ఉండ డం కొసమెరుపు. ఇదిలా వుండగా గొర్రెల కొనుగోళ్ల బిల్లు చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న మొహిదొద్దీన్ ఆచూకీ అంతుపట్టడం లేదు. మొ హిదొద్దీన్‌తో పాటు ఆయన కుమా రుడిపై ఏసీబీ కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తండ్రీకొడుకులిద్దరూ దుబాయ్‌లో తలదాచుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ(ACB) అధికారులు వారిని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెష్ అండ్ ఫాస్టర్, సైమో సంస్థలకు మొహిదొ ద్దీన్ ఎండీగా ఉన్నారు. నెట్ డీల్ షీప్ అండ్ గోల్ ఫామ్స్‌కు(Net Deal Sheep and Goal Farms)డైరెక్టగా ఉన్న మొహిదొద్దీన్ తన పేరు ఎస్ ఎస్ మొయిద్‌గా రికార్డుల్లో నమో దు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. నియో మల్టీప్లెక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రొప్రైటర్‌గా ఉన్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. మొత్తానికి గొర్రెల పంపిణి పథకం యావత్తు అక్రమాలతో అభాసు పాలు కాగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ తంతును వెలికి తీసి అక్రమార్కుల చట్ట పరంగా శిక్షిం చేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్ట మవుతోంది.
Sheep distribution scheme scam