Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

GDP: అభివృద్ధిలోని ఆర్థిక వ్యవస్థకు సూచ‌న‌: మోదీ

భారతదేశ దేశ జీడీపీ గణాంకాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవ స్థకు సూచ‌న‌ అని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు.

అభివృద్ధిలోని ఆర్థిక వ్యవస్థకు సూచ‌న‌ –దేశ జీడీపీ గణాంకాలపై మోదీ

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారతదేశ దేశ జీడీపీ (GDP )గణాంకాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవ స్థకు(Economic system) సూచ‌న‌ అని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. భారత దేశ జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేయగా ఈ గణాంకాలపై మోదీ స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి చేరుకుం దని ప్రకటిం చారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవ స్థకు సూచ‌న‌గా ఆయ‌న పేర్కొన్నా రు. వృద్ధి రేటు మునుపటి అంచనా లను మించిపోయిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ(Country’s GDP) 7 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించినట్లు వెల్లడించా రు. జీడీపీ వృద్ధిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ‘2023-24 Q 4 జీడీపీ వృద్ధి డేటా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని సూచిస్తోంది. ఇది మరిం త వేగం పుంజుకోనుంది. దేశాభివృ ద్ధి (india development)కోసం కష్టపడుతున్న ప్రజలకు ధన్యవాదాలు. జీడీపీ ఈ స్థాయిలో వృద్ధి చెందడం ట్రైలర్ మాత్రమే’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

త్రైమాసిక, వార్షిక వృద్ధి…. 2023–24 నాలుగో త్రైమాసికంలో దేశ వాస్తవ GDP 7.8 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తూ రూ. 47.24 లక్షల కోట్లకు పెరిగింది. ఏడాది పొడవునా, జనవరి-మార్చి కాలంలో 7.8 శాతం స్వల్పంగా మందగించినప్పటికీ, వివిధ రంగా ల్లో బలమైన వృద్ధితో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మంచి పనితీరు కనబ రిచింది.ఈ గణనీయమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్‌లకు పెంచింది. రాబోయే సంవత్సరాల్లో USD 5-ట్రిలియన్ డాలర్ల9 (trillion dollars) లక్ష్యాన్ని సాధించడానికి వేదికను ఏర్పాటు చేసింది.త‌యారీ రంగం ప్రోత్సాహ‌క‌ర వృద్ధి న‌మోదు చేయ‌డంతో మెరుగైన జీడీపీ గ‌ణాం కాలు సాధ్యమయ్యాయి. 2023-2 4లో త‌యారీ రంగం ఏకంగా 8.9 శాతం వృద్ధి చెందింది. ఇక చివ‌రి క్వార్టర్‌లోనూ భార‌త జీడీపీ 7.8 శాతంతో స‌త్తా చాటింది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 0.6 శాతానికి క్షీణించింది.సేవల రంగ వృద్ధి మిశ్రమంగా ఉంది. ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాలు 7.6 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్యం, ఆతిథ్య రంగం 5.1 శాతం పెరిగింది.

GDP figures indication rapidly developing economy