Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP vs Congress: తెలంగాణలో ఢీ అంటే ఢీ

తెలంగా ణలోని లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ అను కుoటున్నాయి. నువ్వా నేనా అం టూ పోటీ పడ్డాయా ఎన్నికల ప్రచా రంలో పోటీ పడగా తాజాగా వెలు వడిన ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వివరిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య తీవ్ర పోటీ
బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కో సీటు కు పరిమితమంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణలోని లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో( telangana lok sabha election results) కాంగ్రెస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ (BJP vs Congress )అను కుoటున్నాయి. నువ్వా నేనా అం టూ పోటీ పడ్డాయా ఎన్నికల ప్రచా రంలో పోటీ పడగా తాజాగా వెలు వడిన ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఉనికిని కోల్పోనుందా లేదంటే ఒక్కటంటే ఒక్కటి అవకాశం ఉందంటూ సర్వే ఫలితాలు చెప్పకనే చెబుతున్నా యి. శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే సంస్థల అంచనా ప్రకారం కాంగ్రెస్‌, బీజేపీ బరాబర్ సమాన సీట్లను సాధించనున్నా యని మరికొన్ని సంస్థలు అయితే.. కాంగ్రెస్‌ కంటే బీజేపీయే పైచేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నా యి.

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆరా సర్వే సంస్థ, ఏబీపీ–సీ ఓటర్‌, పీపుల్స్‌ పల్స్‌ సంస్థలు రెండు పార్టీ లు దాదాపు సమాన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటాయని పేర్కొ న్నాయి. కాంగ్రెస్‌ కచ్చితంగా విజ యం సాధించనున్న స్థానాల్లో వరంగల్‌, పెద్దపల్లి, మహబూబా బాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, నాగర్‌ కర్నూలు, భువన గిరి ఉన్నాయని అనేక సంస్థలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ గెలుపొంద నున్న అన్ని స్థానాల్లోనూ బీజేపీ రెండో స్థానంలో, బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఉండనున్నాయి. ఇండి యా టుడే, న్యూస్‌–18, జన్‌ కీ బాత్‌, ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ సంస్థలు మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుం దని విశ్లేషించాయి. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది.

వీటిలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామా బాద్‌, సికింద్రాబాద్‌ ఉన్నాయి. వీటిని నిలబెట్టుకోవడంతోపాటు చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్‌ స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలున్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. అన్ని సంస్థల కంటే భిన్నంగా బీజేపీ 11–12 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే – మై యాక్సిస్‌ సంస్థ తెలిపిం ది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 43 శాతం ఓట్లను సాధిస్తుందని అంచ నా వేసింది. బీజేపీ 7–10 స్థానా లను కైవసం చేసుకుంటుందని సీఎన్‌ఎన్‌ సంస్థ తెలిపింది. రాష్ట్రం లో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో(lok sabha elections) ఘోర పరాభవాన్ని మూటగట్టుకోనుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచ నా వేశాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలవ్వనుందని దాదాపు అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో(lok sabha elections) అత్యధికంగా 9 స్థానాలు సాధించిన గులాబీ పార్టీ(BRS Party) ఈసారి అన్నిచోట్ల మూడో స్థానానికి పరిమితం కానుందని వివరించా యి. ఒక్క సీఎన్‌ఎన్‌ మాత్రమే బీఆర్‌ఎస్‌ 2–5 స్థానాలు సాధించే అవకాశముందని పేర్కొంది.

BJP vs Congress in telangana lok sabha elections