Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana formation Day: అమరుల త్యాగం వెలకట్టలేనిది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం పోలీస్ పరేడ్ మైదా నంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక ల్లో కలెక్టర్ దాసరి హరిచందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో(Telangana State formation Day Celebrations) భాగంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం పోలీస్ పరేడ్ మైదా నంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. స్వతంత్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం పోలీస్ సేవా పథకాలను ప్రధానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులద ని, అమరుల త్యాగం వెలకట్టలే నిదని జిల్లా ప్రజలకు ఇచ్చిన సందే శంలో కలెక్టర్ పేర్కొన్నారు.

తెలం గాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో భాగస్వాములై సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ వారి హక్కులను ఉపయోగించుకుంటూ, బాధ్య తలను విస్మరించకుండా దేశ సేవకు ,దేశాభివృద్ధికి పాటుపడా లని పిలుపునిచ్చారు. అంత కుముందు క్లాక్ టవర్ చౌరస్తా లోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ (Collector)అమరులకు నివా ళులర్పించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అదనపు ఎస్పీ రాములు నాయక్, డిఆర్ఓ డి .రాజ్యలక్ష్మి, ఆర్డిఓ రవి,జిల్లా అధికారులు,ఇతర అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana State formation Day Celebrations